అలసిపోతుంటే ఒక్క క్షణం ఆగండి

రొటీన్‌గా చేసే పనైనా సరే కొంత చేసేసరికి అందరం అలసిపోతాం. కానీ నిస్త్రాణగా (ఫెటిగ్‌) అయిపోవడం అన్నది వేరు. ఎల్లప్పుడూ అలసిపోయినట్టుగా ఉండే స్థితినే నిస్త్రాణగా చెప్పుకోవచ్చు. ఇది స్ర్తీ పురుషులలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఆడవారిలో ఎక్కువ కనిపిస్తుంటుంది. అలా నిరంతరం అలసిపోయినట్టుగా, బడలికగా అనిపిస్తున్నప్పుడు వెంటనే వైద్యునికి చూపించుకొని దానికి కారణాలు కనుక్కోవలసిన అవసరం ఉన్నది. ఇలాంటి సమస్య రావడానికి కొన్ని కారణాలు..

థైరాయిడ్‌ సమస్యలు :  
థైరాయిడ్‌ గ్రంథి ఉండవలసిన దానికన్నా చురుకుగా ఉన్నా అంతకు లేదా పని చేయకపోతున్నా నిస్త్రాణంగా ఉండడం అనుభవంలోకి వస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి పనితీరు సరిగా లేనప్పుడు ఏమీ చేయకుండానే విపరీతమైన అలసటకు గురవుతారు. చురుకుగా పని చేస్తూ ఉంటే అలసిపోయేంతగా పని చేస్తుంటారు. థైరాయిడ్‌ సమస్యలు మహిళల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యను మందులతో చికిత్స చేయడం వల్ల సంబంధిత అలసట తగ్గిపోతుంది.

విటమిన్‌ డి లోపం :
విటమిన్‌ డి లోపం ఇప్పుడు సర్వసాధరణమైన సమస్యగా కనిపిస్తోంది. ఈ లోపానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ దానిని సరిచేసుకోవచ్చన్నది సంతోషం కలిగించే మాట. వైద్యుడు మీలో లోపం ఎంత మేరకు ఉందనే విషయాన్ని రక్త పరీక్షల ద్వారా కనుగొని అందుకు తగిన చికిత్సను అందిస్తాడు. అలసట బారిన పడనవసరం ఉండదు.


హృద్రోగాలు :
హృద్రోగంతో బాధపడే మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య అలసట.. నిస్త్రాణ. బిపి, ఇసిజి, ఇఇజి వంటి పరీక్షల ద్వారా గుండె ఆరోగ్యాన్ని గురించి తెలుసుకొని వైద్యుని సలహాతో తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

స్లీప్‌ ఆప్నియా :
మీరు నిద్రించే సమయంలో గురక పెడుతున్నారని మీ చుట్టుపక్కల వారు చెప్పినప్పుడు ఎంత పడుకున్నా మీకు అలసట తీరనప్పుడు మీరు స్లీప్‌ ఆప్నియాతో బాధపడుతున్నట్టుగా తెలుసుకోవాలి. ఇది గంభీరమైన సమస్యే. ఎందుకంటే నిద్రించే సమయంలో ఈ సమస్య కలిగిన వారు కొద్ది క్షణాలు శ్వాసతీసుకోవడం ఆపేస్తుంటారు. ఒకవేళ బరువు అధికంగా ఉండడమే ఇందుకు కారణమైతే వెంటనే దానిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఇతర సమస్యలు అయితే వైద్య సలహాతో నివారించే ప్రయత్నం చేయాలి.

ఐరన్‌ లోపం వల్ల వచ్చే అనీమియా :
మన రక్తంలో తగుమాత్రం ఐరన్‌ అవసరం. ఎందుకంటే ఇదే కావలసి న మోతాదులో ప్రాణవాయువును సరఫరా చేస్తుంది. మీరు ఐరన్‌ లో పం ఉన్న అనీమియాతో బాధపడుతూ ఉంటే మీ వైద్యుడు ఆ లోపాన్ని సరి చేసుకునేందకు మీరు తీసుకోవలసిన అహారాన్ని సూచిస్తాడు.

డిప్రెషన్‌ :
డిప్రెషన్‌, ఫెటిగ్‌ కలిసే ఉంటాయి. డిప్రెషన్‌లో ఉన్న మహిళలకు నిద్ర సర్వ సాధారణ సమస్య. దీనితో అలసట మరింత పెరుగుతుంది. ఒకవేళ మీరు డిప్రెషన్‌లో ఉన్నట్టుగా మీకనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం. మీకు పని చేస్తున్న చికిత్స పని చేస్తుంటే మీ అలసట తగ్గుతున్నట్టు మీరే గమనిస్తారు.
 

సరిగా నిద్రపోలేకపోవడం :
కొన్ని సందర్భాలలో మహిళలకు సరిపడా నిద్ర దొరకదు. సగటున ఒక వయోజన మహిళ రాత్రి వేళల్లో ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ని ద్రించాలి. కెరీర్‌, కుటుంబం, సామాజిక జీవితం వంటి వాటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇది సాధ్యం కాదనిపిస్తుంది. అయినప్పటికీ సరైన నిద్ర కోసం సమయం కేటాయించడం మరువరాదు. అం దుకోసం ఒక టైమ్‌ టేబుల్‌ను తయారు చేసుకోవాలి. రోజూ ఒకే సమయానికి నిద్రించడం, లేవడం వంటివి చేయాలి. అలాగే స్థాయికి మించి పని చేయడానికి నిరాకరించడం నేర్చుకోవాలి. బహు పాత్రలలో ఇతరులకు సాయపడే పా త్ర పోషించే మహిళలు ముందుగా తమ ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top