హరియాలి వెజ్‌బాత్‌


కావల్సినవి:
పచ్చిబఠాణీలు- అరకప్పు, కొత్తిమీర- ఒకటిన్నర కప్పు, నూనె- మూడుచెంచాలు, తోటకూర, పాలకూర - కప్పు చొప్పున, టమాటా- కప్పు, అజినోమోటో- చిటికెడు, పచ్చిమిర్చి- ఆరు, అన్నం- రెండున్నర కప్పులు, ఉప్పు- రుచికి తగినంత, షాజీర- చెంచా, కరివేపాకు- నాలుగు రెమ్మలు


తయారీ: 
పచ్చి బఠాణీలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, తోటకూర, పాలకూర, టమాటా, పచ్చి మిర్చిని సన్నగా తరిగి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరవాత బాణలిలో నాలుగు చెంచాల నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక షాజీర, ఆకుకూర ముద్ద వేసి మగ్గించాలి. కొద్దిసేపయ్యాక అజినోమోటో, ఉడికించిన బఠాణీలు, అన్నం వేసి బాగా కలియతిప్పాలి. చివరిగా కరివేపాకుతో అలంకరించుకొని దించేస్తే హరియాలివెజ్‌బాత్‌ సిద్ధమయినట్టే.  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top