ఆరోగ్యానికి నడక.......

నడక ఆడవారికైనా మగవారికైన మంచి మేలు చేస్తుంది. అందుకే చాలా మంది ఉదయాన్నే వ్యాయామంగా ఉంటుందని నడుస్తుంటారు. ముఖ్యంగా గుండెవ్యాధులు, మధుమేహరోగులు నడవడం చాలా మంచిదని వైద్యులు సలహా ఇస్తుంటారు. కేవలం ఇటువంటి వారే కాదు వయసులో ఉన్న ఆడ, మగవారు కూడా నిత్యం నడుస్తుండం చాల మంచిది. చక్కటి ఆరోగ్యానికి నడక ఒక పునాది లాంటిది. అందుకే మనం సాధారణంగా గమనించినట్లయితే పల్లెటూళ్లలో చాలా మందికి నడక బాగా అలవాటు ఉంటుంది. పట్నవాసులు మాత్రం తక్కువ దూరానికి కూడా వాహనాలలో ప్రయాణించి నడకకు దూరమైపోతున్నారు. గ్రామాల్లో ఉన్నవారికి నడవడం అలవాటుంది. కనుకే వారు అన్ని విధాల అరోగ్యంగా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే పల్లెటూళ్లలో ఉండే వారికంటే పట్నం వాసంలో ఉన్నవారికి అందుకే జబ్బుల బెడద చాలా ఉంది. 

ఉదయం వ్యాయామం చేస్తే ఆరోజంతా చలాకీగా ఉండొచ్చు. మేం చేసే పనే మాకు వ్యాయమం అంటూ చాలా మంది మహిళలు చెబుతుంటారు. అయితే పనులకు, వ్యాయామానికి స్వల్ప తేడా ఉన్న విషయాన్ని గమనించరు. పనులు అలసటను కలిగిస్తే, తేలిక పాటి ఎక్స్‌ర్‌సైజ్‌లు చురుకుదనాన్ని అందిస్తాయి. అందుకే తప్పని సరిగా ఉదయం పూట కాస్త శరీరానికి వీలైన వ్యాయమం చేయడం మేలు. వ్యాయామంపై ఆసక్తిలేని వారు కనీసం కొంత సేపు నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నడకనైనా క్రమం తప్పుకుండా ఒక నిర్ణీత సమయంలో చేస్తే ఆరోగ్యవంతంగా ఉండొచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. భర్తతో కలిసి సూర్యుడు నిద్రలేవకముందే లేచి కాసేపు వేగంగా నిటారుగా నడిస్తే, బిజీ జీవితంలో ఇద్దరూ కాసేపు మాట్లాడుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది.

హుందాతనం...  

ఈ నడక సక్రమంగా ఉంటే మనిషికి హుందాతనంతో పాటు మనిషి ఆకారం పొందికగా ఉంటుంది. ముఖ్యంగా నడక బాన పొట్టను తగ్గిస్తుంది. ఆడవారికైనా, మగవారికైనా పెద్ద పొట్ట ఉంటే అది ఆకారాన్ని, అందాన్ని పాడుచేస్తుంది. అందువల్ల నడిచేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.నిటారుగా, అడుగులు ఒక క్రమబద్ధంగా వేస్తూ హుందాగా నడవడం చాలా మంచిది. దీనివల్ల పొట్ట తగ్గడంతో పాటు ఆకారంలో మంచి మా ర్పు వస్తుంది. అలా కాకుండా రిలాక్స్‌ గా నడవడం ప్రారంభిస్తే మాత్రం అనుకున్న ఫలితం సాధించ లేం. నిటారుగా నడవడం వల్ల పొట్ట తగ్గడమే కాక క్రమేపి గుండె విశాలంగా మారుతాయి. మన వ్యక్తిత్వంలో విశ్వాసాన్ని నింపుతుంది. నిటారుగా, హుందాగా, గంభీరంగా నడిచే వ్యక్తుల్ని చూస్తే ఒక సదభిప్రాయం కలుగుతుంది.

ఎటువంటి దుస్తులు...

నడిచేటప్పుడు ఎటువంటి దుస్తులు వేసుకోవాలన్ని విషయంలో కొంతమందికి అవగాన ఉండదు. షర్టులు, ట్రౌజర్స్‌ బిగువైన ఇతర దుస్తులను వేసుకోకూడదు. దీని వల్ల మన శరీరంలో బ్లడ్‌ సర్కులేషన్‌ తగ్గుతుంది. దాంతో తలనొప్పి రావడం, కడుపులో మంట, గ్యాస్టిక్‌ట్రబుల్‌ వంటివి వచ్చే అవకాశం ఉంది. అందుకే నడిచేటప్పడు మగవారు గానీ, ఆడవారు గానీ నడుముకు బెల్టు పెట్టుకుంటే దానిని మరీ టైట్‌గా పెట్టుకోకూడదు. ఇటువంటి చిన్న జాగ్రత్తలు తీసుకుని న్యితం నడక సాగిసే ఆరోగ్యానికి సోపానాలు వేసినట్లే.  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top