కావల్సినవి: పాలు - అరలీటరు, కస్టర్డ్ పొడి - రెండు టేబుల్స్పూన్లు, పంచదార- 6 టేబుల్ స్పూన్లు , బ్రెడ్స్త్లెసులు - పది, బాదం, జీడిపప్పు పలుకులు- పావుకప్పు, చెర్రీలు - పది; జామ్ - పావుకప్పు
తయారీ:
పాలు మరిగించాలి. కాసిని పాలల్లో కస్టర్డ్ వేసి గరిటెజారుగా కలిపి కాచిన పాలకు చేర్చాలి. సన్నని మంటపై ఉంచి.. చిక్కగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఆ తరవాత పంచదార చేర్చాలి. అది కూడా కరిగాక దింపి చల్లారనిచ్చి ఫ్రిజ్లో రెండు గంటలు ఉంచాలి. బ్రెడ్ స్త్లెసుల్ని తీసుకుని అంచులు తొలగించి, ఒక్కోదానిపై జామ్ రాయాలి. ఆ తరవాత చెంచా చొప్పున పాలు అక్కడక్కడ పడేలా చల్లాలి. ఇప్పుడు సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పలుకులు వేయాలి. వీటిని చేత్తో చుట్టుకుంటే.. లడ్డూల్లా అవుతాయి. ఇలా చేసుకున్న వాటన్నింటినీ చల్లగా అయిన కస్టర్డ్లో వేసి.. పైన మిగిలిన డ్రైఫ్రూట్స్, చెర్రీలు వేస్తే చాలు.. నోరూరించే స్నోబాల్స్ సిద్ధం.