రైస్‌ మంచూరియా


కావలసినవి
ఉడికించిన బంగాళాదుంప: ఒకటి, క్యాబేజీ తురుము: అరకప్పు, బఠాణీలు: అరకప్పు, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, అన్నం: కప్పు, ఉప్పు: సరిపడా, ఎండుమిర్చి: ఒకటి, మైదా: అరకప్పు, సోయాసాస్‌: అరటీస్పూను, ఉల్లిపాయ: ఒకటి, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, పచ్చిమిర్చి ముద్ద: టీస్పూను, వినెగర్‌: అరటీస్పూను, టొమాటోసాస్‌: 2 టేబుల్‌స్పూన్లు, చిల్లీసాస్‌: అరటీస్పూను, ఉప్పు: సరిపడా, నూనె: వేయించడానికి సరిపడా.


తయారుచేసే విధానం
* బఠాణీలు ఉడికించి ఉంచాలి.
* బంగాళాదుంప పొట్టు తీసి మెత్తగా మెదపాలి. అందులోనే క్యాబేజీ తురుము, ఉడికించిన బఠాణీ, అన్నం, ఉప్పు, ఎండుమిర్చి వేసి మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని మైదాపిండిలో దొర్లించాలి.
* స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె పోసి కాగాక ఈ ఉండల్ని వేసి ఎర్రగా వేయించి తీయాలి.
* ఇప్పుడు బాణలిలో నూనె వేసి ముందుగా ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత  అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, వినెగర్‌, సోయాసాస్‌, టొమాటోసాస్‌, ఉప్పు వేసి రైస్‌ బాల్స్‌ వేసి ఓ సారి వేయించి తీయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top