కుర్మా కర్రీ!


కావలసినవి
టొమాటోలు: 2, పెరుగు: కప్పు, మిర్చి: 2, ఉప్పు: టీస్పూను, పనసముక్కలు: 2 కప్పులు,  కరివేపాకు: 2 రెబ్బలు, కారం: 2 టీస్పూన్లు, జీడిపప్పు: 12, కొబ్బరితురుము: 5 టీస్పూన్లు, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, గరంమసాలా: టీస్పూను, నూనె: 5 టీస్పూన్లు


తయారుచేసే విధానం
* పనస ముక్కలను ఉడికించి ఉంచాలి.
* టొమాటోముక్కలు, పచ్చిమిర్చి మిక్సీలో వేసి గుజ్జులా చేసుకోవాలి. జీడిపప్పు, కొబ్బరి కలిపి మిక్సీలో వేసి ముద్దగా చేయాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక కరివేపాకు, అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. తరవాత టొమాటో గుజ్జు వేసి ఉడికించాలి. పనసముక్కలు వేసి కలపాలి. జీడిపప్పు ముద్ద కూడా వేసి కాసేపు ఉడికించాలి.
* ఉప్పు, కారం, గరం మసాలా, పెరుగు వేసి సిమ్‌లో ఓ రెండు నిమిషాలు ఉంచి దించాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top