ఓట్స్‌ పకోడి


కావల్సినవి:
ఓట్స్‌- రెండు కప్పులు, సెనగపిండి- మూడు కప్పులు, ఉల్లిపాయలు- మూడు, పచ్చిమిర్చి- ఆరు, ఉప్పు- రుచికి తగినంత, కొత్తిమీర- కొద్దిగా, జీడిపప్పు- పది, జీలకర్ర- చెంచా, పెరుగు- రెండుకప్పులు, నూనె -వేయించడానికి సరిపడా.


తయారీ:
ముందుగా ఓట్స్‌ను పెరుగులో ఐదు నిమిషాలు నానబెట్టాలి. తరవాత ఇందులో సెనగపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, జీడిపప్పు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి పకోడీల పిండిలా కొంచెం గట్టిగా కలపాలి. బాణలిలో నూనె వేడిచేసి ఈ పిండిని పకోడీల్లా వేయాలి. గోధుమవర్ణంలోకి వచ్చాక తీసేయాలి. వేడివేడి ఓట్స్‌ పకోడి సిద్ధం. సెనగపిండి పడనివారికి పెరుగు మేలు చేస్తుంది. అజీర్తి సమస్య ఉండదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top