ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ చేస్తే పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో ఉండటం సాధ్యమవుతుందా?

ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌ల ప్రథమ ప్రయోజనం ఏమిటంటే శరీరంలో అదనంగా చేరి ఉన్న కొవ్వును కరిగించడం, ఆ తర్వాత గుండె, ఊపిరితిత్తులు తదితర ప్రధాన అవయవాలు మరింత సమర్థంగా పనిచేసేటట్లు చూడటం. ఒక క్రమపద్ధతిలో రెగ్యులర్‌గా ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల మంచి కొలెస్టరాల్ పెరుగుతుంది. చెడు కొలెస్టరాల్, ట్రైగ్లిసరైడ్స్ శాతం తగ్గుతుంది. ముఖ్యమైన అన్ని అవయవాలూ పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. ఎముకల సాంద్రత, కీళ్లలో కదలికలు పెరిగేందుకు తోడ్పడుతుంది. హృద్రోగం, మధుమేహం, ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు నియంత్రణలో ఉంటాయి. శారీరక సామర్థ్యం, రోగనిరోధకశక్తి పెరుగుతాయి.

అయితే వీటి తాలూకు పూర్తి ప్రయోజనాలు పొందాలంటే కనీసం 12 వారాల పాటు క్రమం తప్పకుండా ఏరోబిక్ ఎక్సర్‌సెజైస్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఏ ఎక్సర్‌సైజ్‌లైనా చేసేటప్పుడు శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఆ క్రమంలో శరీరం తనకు తాను అనేక విధాలైన అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటుంది అందుకే కేవలం ఒకటి రెండు వారాలపాటు చేసి, అంతగా ప్రయోజనం లేదులే అని నిస్పృహతో మానేస్తుంటారు. అది చాలా తప్పు అవగాహన. అదేవిధంగా ఏరోబిక్ ఎక్సర్‌సెజైస్ చేస్తున్నాము కదా అని, ఇతర జాగ్రత్తలు ఏమీ తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఆరోగ్యకరమైన ఆహారపు అటలవాట్లను పాటిస్తూ, సక్రమంగా స్ట్రెంత్ ట్రయినింగ్, స్ట్రెచింగ్, రిలాక్సేషన్ తదితర ఎక్సర్‌సైజ్‌లు కూడా అవసరం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top