మానసిక సమస్యలకు హోమియో మేలు

నగర జీవన విధానం, పెరిగిన పని ఒత్తిడి ఎన్నో వ్యాధులకు కారణమవుతోంది. మానసిక ఒత్తిడి వల్ల వ్యాధి నిరోధక శక్తి దెబ్బతింటోంది. నాడీవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థపైన ప్రభావం పడుతోంది. మరి ఒత్తిడిని దూరం చేసుకొనేదెలా? 

మారుతున్న జీవన విధానం మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు ఏవీ సఫలం కావడం లేదు. ఒత్తిడి నుంచి బయటపడలేని పరిస్థితులలో కోపం, ఉద్రేకానికి లోనవుతున్నారు. మానసిక ఒత్తిడి శారీరకంగానూ, మానసికంగానూ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి, నాడీవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థపై కూడా దీని ప్రభావం పడుతుంది. శరీరం అంతర్గతంగా, బాహ్యంగా ఎప్పుడూ మానసిక ఒత్తిడికి లోనవుతూనే ఉంటుంది. కానీ చాలా మంది దీన్ని గుర్తించలేరు.

ఒత్తిడికి కారణాలు
శరీరం కొన్ని లక్షణాల ద్వారా మానసిక ఒత్తిడికి గురవుతున్నామని హెచ్చరిస్తూ ఉంటుంది. కళ్లు తిరగటం, కోపం, చిరాకు, నిద్రలేమి, తిమ్మిర్లు, ఆకలిలేకపోవడం, మలబద్ధకం, బి.పి పెరగటం, షుగర్ లెవెల్స్ పెరగటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒత్తిడి కలిగినపుడు అడ్రినల్ గ్రంథి కార్టికోస్టిరాయిడ్స్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది రక్తంలో కార్టిసాల్‌గా మార్పు చెంది వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది.



నవ్వుతో మేలు
 నవ్వు నాలుగు విధాల మేలు అనేది అక్షర సత్యం. నవ్వును జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు. ్ఙ నవ్వడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. రక్తపోటు తగ్గుతుంది. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ్ఙ నవ్వు సీరమ్ కార్టిసాల్‌ను తగ్గించి టి లింఫోసైట్స్ పనితనాన్ని పెంచుతుంది. టీ సెల్స్ పెరుగుదలకు కూడా దోహదపడుతుంది. ఈ విషయం పరిశోధనల్లో రుజవయింది.

నవ్వు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా, వ్యాధి నుంచి కాపాడే ప్రొటీనులు, గామ్మా-ఇంటర్ ఫెరాన్, వ్యాధిని నయం చేసే యాంటీబాడీస్ బి-సెల్స్‌ను పెంచుతుంది.
 

 ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే మానసిక ప్రశాంతత అవసరం. మానసిక ప్రశాంతత వలన శరీరం తన పూర్వ స్థితిని పొందుతుంది.ఉద్రేక పరిస్థితులలో కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి. వీటివల్ల దేహంలో కోల్పోయిన కార్బోహైడ్రేట్స్, కొవ్వును సమపాళ్లలో ఉంచుతుంది. ్ఙ చురుకుగా, ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూ ఉండటం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు.


చికిత్స
ఆందోళన, నిద్రలేమి, టెన్షన్, ఇతర మానసిక అసమానతలకు హోమియోలో మంచి చికిత్స ఉంది. ఎలాంటి దుష్ప్రభావాలులేకుండా వ్యాధిని తగ్గించడం జరుగుతుంది. రోగి శారీరక, మానసిక పరిస్థితులను పరిశీలించి జెనెటిక్ కాన్‌స్ట్టిట్యూషనల్ చికిత్స ద్వారా ఒత్తిడిని తగ్గించడం జరుగుతుంది.

ఎకొనైట్ :

చల్లగాలి వలన పెరిగే బాధలు, మానసిక ఆందోళన, బయటకు వెళ్లాలంటే భయం, విందు వినోదాలలో నలుగురిలోకి వెళ్లాలంటే భయం, మరణం దగ్గర పడిందనే భావన, కుదురుగా కూర్చోలేరు, చిన్న విషయానికి కూడా భయపడిపోతుంటారు, సంగీతం భరించలేరు, నిద్రపట్టదు.. ఇలాంటి లక్షణాలు ఉన్న రోగికి సూచించదగిన ఔషధం. ఆర్సెనిక్ ఆల్బ్ : డిప్రెషన్, మానసిక ఆందోళన, నిరాశ, నిస్ప్రహ, కోపం, చిరాకు, విసుగు, నడవాలంటే అశక్తత, ఏ మందులు నా జబ్బును తగ్గించలేవనే భావన, ఒంటరిగా ఉండాలంటే భయం, రాత్రుళ్లు పెరిగే ఆందోళన, దాహం ఉంటుంది కానీ నీళ్లు తాగాలనిపించదు, పండ్లంటే అయిష్టం, చల్లటి పదార్థాలు పడవు, రోజు రోజుకు బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు ఉపయోగించవచ్చు.

ఆరం మెటాలికం : 

సున్నిత స్వభావులు, కోపం, బాధ, డిప్రెషన్, భయం, ఇతరుల చేత విమర్శింపబడటం వల్ల బాధ కలగడం, చిన్న వయసులో బరువు,బాధ్యతలు, స్థిర చరాస్తుల నష్టంవలన కలగే బాధలు, నిరాశ, నిస్ప్రహల జీవితం, జీవితంపైన విరక్తి, ఆత్మహత్యా ప్రయత్నాలు, చేసిన పనికి పశ్చాత్తాపపడటం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారికి ఇది మంచి ఔషధం. వీటితో పాటు నేట్రమ్ మూర్, నేట్రమ్ కార్బ్, జెల్సిమియం, మెగ్నిషియ కార్బ్, పాస్పిఫోర వంటి మందులు కూడా మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అయితే నిపుణులైన హోమియో వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top