రైస్‌ కబాబ్‌


కావలసినవి
అన్నం: ఒకటిన్నర కప్పులు: సెనగపప్పు: అరకప్పు, ఉల్లిపాయ: ఒకటి. సెనగపిండి: పావుకప్పు, పచ్చిమిర్చి: 2, కొత్తిమీర: పావుకప్పు, అల్లంవెల్లుల్లి: టీస్పూను, నిమ్మరసం: అరటీస్పూను, ఉప్పు: సరిపడా, నూనె: వేయించడానికి సరిపడా 

తయారుచేసే విధానం
* సెనగపప్పు ఉడికించి ఉంచాలి.

* ఇప్పుడు సెనగపప్పు, అన్నం, ఉల్లిపాయ, ఉప్పు, అల్లంవెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.

* ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసి అందులో సెనగపిండి, కొత్తిమీర తురుము, నిమ్మరసం కలపాలి. వీటిని బోండాల్లా కానీ వడల్లా కానీ చేసుకుని నూనెలో వేయించి తీయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top