కాకర కొబ్బరి కారం


కావల్సినవి:
కాకరకాయలు- అరకేజీ, ఎండుకొబ్బరి కోరు- కప్పు, ఎండుమిర్చి- నాలుగు, వెల్లుల్లి- ఒకటి, చిక్కటి మజ్జిగ- రెండుకప్పులు, పసుపు- చెంచా, ఉప్పు- రుచికి తగినంత, నూనె- కొద్దిగా, నిమ్మచెక్క- ఒకటి

 తయారీ:
ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి పైన కొద్దిగా బొడిపెలుగా ఉన్న దాన్ని తీసివేయాలి. కాకరకాయలకు మధ్యలో గాటు పెట్టుకోవాలి. చిక్కటి మజ్జిగలో పసుపు, ఉప్పు, నిమ్మచెక్క పిండి దానిలో రెండుమూడు గంటలపాటు కాకరకాయలు ఊరనివ్వాలి. కొబ్బరి తురుము, ఎండుమిర్చి, వెల్లుల్లి మిక్సీలో వేసి పొడి చేయాలి. ఇప్పుడు మజ్జిగలో ఊరిన కాకరకాయల్లో కొబ్బరికారం పెట్టి దారంతో కట్టాలి. తరవాత బాణలిలో నూనె వేడి చేసి కాకరకాయలను బాగా వేయించాలి. అంతే ఎంతో రుచికరమైన కాకరకాయ కొబ్బరి కారం సిద్ధమయినట్టే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top