క్యాలీఫ్లవర్‌ కబాబ్స్‌


కావల్సినవి: 
క్యాలీఫ్లవర్‌- 200 గ్రాములు, బంగాళాదుంపలు- అరకేజీ, ఉల్లిపాయలు- రెండు, బ్రెడ్‌ ముక్కలు- నాలుగు, కొత్తిమీర, పుదీనా- కొద్దిగా, వెల్లుల్లి- ఐదు, వెన్న- రెండు చెంచాలు, పచ్చిమిర్చి- మూడు, బ్రెడ్‌పొడి- కప్పు, షాజీరా- కొద్దిగా, నూనె- పావుకప్పు, ఉప్పు, మిరియాలపొడి- తగినంత.

తయారీ:
ముందుగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, షాజీరా, అన్నింటినీ కలిపి మిక్సీలో ముద్ద చేసుకోవాలి. అలానే బంగాళాదుంపను ఉడికించి చల్లారాక చేత్తో మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. తరవాత క్యాలీఫ్లవర్‌ను ఉప్పు నీటిలో కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయలు దోరగా వేయించి మసాలా ముద్ద, ఉప్పు వేసి మగ్గించి క్యాలీఫ్లవర్‌ ముక్కలు జోడించాలి. అవి బాగా వేగాక దించి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్‌ ముక్కలను తడిపి చేత్తో బాగా పిండి చల్లారిన క్యాలీఫ్లవర్‌ వేపుడులో కలిపితే ముద్దగా అవుతుంది. దాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంప ముద్దకు ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా వెన్న చేర్చి బాగా కలియతిప్పాలి. ఈ  మిశ్రమాన్ని కాస్త పెద్ద ఉండగా చేసుకొని మధ్యలో క్యాలీఫ్లవర్‌ మిశ్రమాన్ని పెట్టి నాలుగు వైపుల నుంచి మూసి రెండుగా కబాబ్‌ మాదిరి చేసి బ్రెడ్‌ పొడి అద్దాలి. పెనం పొయ్యి మీద పెట్టి వేడిచేసి సన్నటి సెగ ఉంచి వీటిని తక్కువ నూనెతో దోరగా కాల్చి దించేయాలి. క్యాలీఫ్లవర్‌ కబాబ్స్‌ను టమాటాసాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top