వర్షాకాలం వచ్చిందంటే వాకింగ్‌కు డుమ్మానా?

వర్షాకాలం వచ్చిందంటే వాకింగ్‌కు ఎసరు వస్తుంది. ముసురు పట్టిందికదా అని ముసుగుతన్ని పడుకుంటారు చాలా మంది. దీంతో మిగిలిన ఎనిమిది నెలలు పడిన శ్రమ అంతా వృథా అవుతుంది. వర్షాకాలంలో ఫిట్‌నెస్ కోసం మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.అవేంటో చూద్దాం.

ఈవర్షం వేళ, ముసురు పట్టినప్పుడు వాకింగ్ చేయకపోవడమే మేలు. గాలిలో తేమ ఎక్కువగా ఉండడం, నేలంతా చిత్తడిగా ఉండడం వల్ల వాకింగ్ సరిగా సాగదు.

ఈఅయితే వాకింగ్‌కు బదులుగా ఇంట్లోనే స్కిప్పింగ్, సైక్లింగ్ వంటివి చేయాలి.
ఈఇంట్లోనే కనీసం 40 నిముషాలకు తగ్గకుండా వ్యాయామం చేసుకోవాలి.
ఈవర్షాలు కురుస్తున్నప్పుడు శారీరిక శ్రమ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పని సరిగా ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయాలి. ఈఇంట్లో మిగిలిన వ్యాయామాలు చేసే అవకాశం లేని వారికి యోగా ఉత్తమం.
ఈపడకగదిలో లేదా హాల్‌లో ఒక దుప్పటి పరుచుకొని ఓ అరగంట సేపు యోగాసనాలు వేయాలి. ప్రాణాయామం వంటి శ్వాసపరమైన వ్యాయామాలు ఈ సీజన్‌లో చాలా మంచివి.
 

ఈకాస్త ఎండ వచ్చిన రోజున తప్పనిసరిగా వాకింగ్‌కు వెళ్లండి. ఎలాగూ నాలుగు రోజులు పోలేదు కాబట్టి ఈ సీజన్‌కు వాకింగ్ వదిలేద్దాంలే అనే ధోరణి సరికాదు. ఈముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఈ సీజన్‌లో రెగ్యులర్‌గా వాకింగ్ కుదరదు కాబట్టి తప్పనిసరిగా ఇంట్లోనే వ్యాయామాలు చేసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top