పండ్లలో రారాజు... టమోటా


పండ్లలో రారాజు ఎవరు అని అడిగితే...ఆపిల్ లేదా మామిడిపండు అని అనుకుంటారేమో... అస్సలు కాదు. ప్రపంచంలో ఉన్న పండ్లన్నిలో రారాజు టమోటా. నమ్మినా...నమ్మకపోయినా ఇది నిజం. ప్రపంచ వ్యాప్తంగా 1.6 కోట్ల టన్నుల టమోటా పండుతోంది. ఇంత పెద్ద మొత్తంలో పండే పంట ఇదొక్కటే. టమోటా అంటే కూరగాయ కదా! యాపిల్‌తో, మామిడి పండుతో పోల్చుతున్నారేంటి అనుకుంటున్నారా? చాలాదేశాల్లో ప్రజలు దీన్ని పండుగానే తింటారు.

అందుకే టమోటా మోస్ట్ పాపులర్ ఫ్రూట్ ఇన్ ద వరల్డ్‌గా నిలిచింది. పండ్లలో టమోటా తరువాత స్థానం అరటిపండు, ఆపిల్ దక్కించుకున్నాయి. టమోటాలో విటమిన్ 'ఎ', 'బి' పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే పండు ఇదే. క్యాన్సర్ రాకుండా కాపాడే గుణాలు కూడా టమోటాలో ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఇక నుంచి మనం కూడా టమోటాని పండులా వాడుకుంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.'
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top