వ్యాయామం ముందు తరవాత తీసుకొనే ఆహార నియమాలు

వ్యాయామానికి ముందు
గంట ముందు శరీరానికి కార్బోహైడ్రేట్లు అందించాలి. యాపిల్‌, బ్రెడ్‌ స్త్లెసులు, కార్న్‌ఫ్లేక్స్‌, ఇడ్లీ, అరటిపండు తీసుకోవాలి. ఇవి త్వరగా అరుగుతాయి. శరీరానికి తక్షణ శక్తినందిస్తాయి. అలానే సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగాలి. ఈ నియమాలు పాటించడం వల్ల శరీరం త్వరగా అలసటకు గురవ్వదు.


వ్యాయామం తరవాత: 
  • వ్యాయామం వంటివి చేసిన వెంటనే శరీరానికి గాలి తగలాలి. తరవాత స్నానం చేస్తే మనసు ఉత్తేజితంగా ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా ఆహారం తీసుకోవాలి.
  •  వ్యాయామం చేసినప్పుడు చెమట వల్ల శరీరం సోడియం నిల్వలని కోల్పోతుంది. అందుకే నీళ్లతోపాటు గ్లూకోజ్‌ నీళ్లు కూడా తీసుకోవాలి. 
  • జంక్‌ఫుడ్‌ కాకుండా పోషకాహారం తీసుకోవాలి. ఆకుపచ్చని రంగులో లభించే ఆహారం మీద దృష్టిపెడితే మంచిది అందులో పీచు దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  
  •  కండరాలు దృఢంగా ఉండాలంటే.. కప్పు పెరుగులో యాపిల్‌, అరటి ముక్కలు కలిపి మిక్కీలో మెత్తగా రుబ్బి తీసుకోవాలి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా లభిస్తాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top