కిడ్నీ వ్యాధిగ్రస్థులకు శాకాహారమే మేలు


మాంసాహారం కంటే శాకాహారమే చాలా బెస్ట్‌ అని డాక్టర్లు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇక శాకాహారాన్ని తీసుకుంటే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎంతో ఉపశమనం లభిస్తుందని ఇటీవల నిర్వ హించిన ఓ పరిశోధనలో తేలడం విశేషం. ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవడం మూలంగా అవి వారి శరీరంలో ఫాస్పరస్‌ టాక్సిక్‌ లెవెల్స్‌ను పూర్తిగా అదుపు చేస్తాయని పరిశోధకులు తేల్చిచెప్పారు. 

కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఫాస్పరస్‌ను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉం టుంది. ఎక్కువగా ఫాస్పరస్‌ను తీసుకుంటే గుండె వ్యాధులు రావడంతో పాటు అకస్మాత్తుగా చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. క్రానిక్‌ కిడ్నీ వ్యాధితో బాధప డేవారు ఫాస్పరస్‌ను చాలా తక్కువగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైన డైట్‌ను తీసుకోవాలని వారు చెబుతుంటారు. శాకాహారం, మాంసాహారాన్ని తీసుకున్న తొమ్మిది మంది క్రానిక్‌ కిడ్నీ వ్యాధిగ్రస్తులపై ఇటీవల ఇండియా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ బృందం ఓ స్టడీ నిర్వహించింది.

ముందుగా ఈ పేషెంట్లలో కొందిరికి శాకాహా రాన్ని, మరికొందరికి మాంసాహారాన్ని వారం రోజుల పాటు అం దించారు.ఆ తర్వాత మార్పు చేసిన మరో డైట్‌ను రెండు నుంచి నాలుగు వారాల పాటు అందజేశారు. వెజిటేరియన్‌ డైట్‌ తీసుకు న్నప్పుడు వారి మూత్రంలో ఫాస్పరస్‌ శాతం పూర్తిగా తగ్గింది. అదే మాంసాహారాన్ని తీసుకున్నప్పుడు ఫాస్పరస్‌ శాతం బాగా పెరి గింది. దీంతో క్రానిక్‌ కిడ్నీ వ్యాధి ఉన్న వారు శాకాహారం మేలని ఈ పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన గురించి పూర్తి వివరా లను క్లినికల్‌ జర్నల్‌ ఆఫ్‌ ద అమెరికన్‌ సొసైటీ నెఫ్రాలజీ ఇటీవల సంచికలో ప్రచురించారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top