కీళ్ళ నొప్పులు - రకాలు

కీళ్ళ నొప్పులంటే వృద్ధాప్యంలో వచ్చేవి మాత్ర మే కావు. 6 నుంచి 60 ఏళ్ళ పైబడి కూడా ఏ వయస్సులోని వారికైనా ఈ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. యుక్తవయస్సులో వారికి ఈ నొప్పులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

మజిల్‌ పెయిన్స్‌ (కండరాల నొప్పులు), బలహీనత (మయోసిటిస్‌), ఆస్టియోపొరాసిస్‌, హీల్‌ పెయిన్స్‌, ఎంతకూ తగ్గని అల్సర్లు, రక్తనరాలను ప్రభావితం చేసే వ్యాధులు (వాస్క్యులైట్స్‌), సొరియాటిక్‌ ఆర్థరిటిస్‌ (స్కిన్‌ సొరియాసిస్‌తో కూడిన జాయింట్‌ పెయిన్స్‌), స్కెలెరోడెమ్రా (చేతులు, ముఖం పై చర్మం బిగుతు కావడం), నోరు, కళ్ళు తరచూ ఎండిపోవడం, ఆటోఇమ్యూన్‌ తదితర అంశాల్లో రుమటాలజిస్ట్‌ తగు చికిత్సను అందించగలుగుతారు.


కీళ్ళనొప్పులు వచ్చేందుకు వందకు పైగా కారణాలున్నాయి. వృద్ధ్దాప్యం కారణంగా క్షీణించిన కీళ్ళ వల్ల సాధారణంగా వృద్ధులు కీళ్ళనొప్పులకు గురవుతుంటారు. యుక్తవయస్సులో ఉన్నవారు మాత్రం ఇన్‌ఫ్లమేటరీ లేదా ఇన్‌ఫెక్టివ్‌ వ్యాధులకు గురవుతుంటారు. కొన్ని సందర్భాల్లో వృద్ధులు కూడా ఈ వ్యా దులకు లోనవుతుంటారు. దెబ్బల కారణంగా కూడా ఈ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి శరీరానికి కావలసినంత కాల్షియం తక్కువైనా మనకి కీళ్లనొప్పులు వస్తుంటాయి. వయసుతో సంబం దం లేకుండా ఈ రోజుల్లో చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకూ ఈ కీళ్లనొప్పుల సమస్యలు అధికంగా ఉంటున్నాయి. కీళ్ళనొప్పులు వచ్చేందుకు దారి తీసిన పరిస్థితులను బట్టి చికిత్స ఉంటుంది.


క్షీణత కారణంగా వచ్చే వ్యాధులు సాధారణంగా బరువును మోసే కీళ్ళు మోకాళ్ళు (ఆస్టియోఆర్థరిటిస్‌) లాంటి వాటిని ప్రభావితం చేస్తాయి. ఇన్‌ఫ్లమేటరీ జాయింట్‌ డిసీజెస్‌ (రుమటాయిడ్‌ అర్థరిటిస్‌) చిన్న చిన్న జాయింట్లు చేతిభాగం, మణికట్టు కీళ్ళను ప్రభావితం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం మోకాళ్ళు, మోచేతుల కీళ్ళు కూడా ఈ తరహా వ్యాధులకు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. 

వెన్ను దిగువ భాగంలో నొప్పి రెండు రకాలు. కూర్చొనే భంగిమ సరిగా ఉండకపోవడం, దీర్ఘకాలం పాటు డ్రైవింగ్‌ చేయడం, వెనుక భాగంలో బాగా స్ట్రెయిన్‌కు గురి కావడం, ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం, ఎక్కువ బరువులు మోయడం లాంటి వాటి కారణంగా వచ్చే మెకానికల్‌ నొప్పులు ఒకరకమైతే, యాంకిలాజింగ్‌ స్పాండిలైటిస్‌ లాంటి వాటి కారణంగా వచ్చే ఇన్‌ఫ్లమేటరీ నొప్పులు రెండో రకం. ఈ రెండో రకం తీవ్రమైన సమస్య. సాధారణంగా ఇది పిరుదుల నొప్పితో కూడా ముడిపడిఉంటుంది. దీనికి సత్వర చికిత్స తీసుకోవడం మంచిది. మొదటి రకం (మెకానికల్‌) సమస్యలను మందులతో, ఫిజియోథెరపీతో పరిష్కరించుకునే అవకాశం ఉంది. నొప్పి ఏ రకమైందో పరీక్షల అనంతరమే రుమటాలిజిస్ట్‌ నిర్ణయించగలుగుతారు. 

కీళ్ళనొప్పులను నిర్లక్ష్యం చేస్తే అవి బాగా దెబ్బతినే అవకాశంప ఉంది. కీళ్ళ స్థానభ్రంశానికి దారి తీయవచ్చు. ఇది హఠాత్తుగా అప్పటికప్పుడు జరిగేది కాదు. కొన్ని నెలల నుంచి కొన్ని ఏళ్ళు కూడా పట్టవచ్చు. ఒకసారి ఇలా జరిగితే మాత్రం, చికిత్స కాస్త కష్టమే. ఈ వ్యాధులను ఎంత త్వరగా గుర్తించగలిగితే, అంతగా చికిత్స, నయం అయ్యే అవకాశాలూ ఉంటాయి. రెగ్యులర్‌ ఫాలోఅప్‌, ట్రీట్‌మెంట్‌ రెండూ ఎంతో ముఖ్యమైనవి. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top