ఆస్తమా-కారణాలు-నిర్ధారణ-నివారణ-హోమియోవైద్యం

దుమ్ము, ధూళి, పొగ, చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాలు, ప్లాస్టిక్‌బ్యాగ్స్, కార్పెట్స్, బెడ్‌షీట్స్, బ్లాంకెట్స్‌లలో డస్ట్‌మైట్స్(చిన్న పరాన్నజీవులు) ఉంటాయి. కాబట్టి పదిరోజులకొకసారి ఎండలో వేయడం, శుభ్రంగా ఉతుక్కోవడం చేయాలి.

వర్షాకాలం ప్రారంభమవుతోందంటే చాలు ఆస్తమా రోగులు వణికిపోతుంటారు. కాస్త చల్లగాలి తగిలినా చాలు శ్వాసలో ఇబ్బంది తలెత్తుతుంది. వాతావరణంలో చిన్నపాటి మార్పులను కూడా వారు తట్టుకోలేరు. ఆహారంలో మార్పులు, కాలుష్యం, పొగతాగడం వంటివి సమస్యను మరింత జటిలం చేస్తుంటాయి. చిన్న పిల్లలు సైతం ఆస్తమా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడటం ఒక్కటే దీనికి పరిష్కారము.

దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులలో అలర్జీ రియాక్షన్ ద్వారా ఊపిరితిత్తులలో గాలిమార్గానికి అడ్డంకులు ఏర్పడి శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. శ్వాసకోశమార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుచించుకపోవడం వల్ల ఆస్తమా వస్తుంది.

కారణాలు
చల్లగాలి(చల్లటి వాతావరణం), దుమ్ము, ధూళి, పొగ, అలర్జీ కారకాలు(గడ్డి చెట్లు, ఫంగస్, కాలుష్యం), రసాయనాలు(ఘాటు వాసనలు), శారీరక శ్రమ, వైరల్ ఇన్‌ఫెక్షన్, పెంపుడు జంతువుల విసర్జక పదార్థాలు, శ్వాసకోశాల్లో ఇన్‌ఫెక్షన్స్ వంటివి ఆస్తమాకు కారణమవుతున్నాయి.

నిర్ధారణ
వంశానుగత చరిత్ర, అలర్జీ, ఎగ్జిమాకు సంబంధించిన పరీక్షలు, ముక్కు, గొంతు, ఛాతీ పరీక్షలు, కఫం పరీక్ష, ఎక్స్‌రే, చర్మానికి సంబంధించిన అలర్జీ పరీక్షలు, స్పైరోమెట్రీ(శ్వాసమీటర్ ద్వారా పరీక్ష)ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామం, పోషకాహారం తీసుకున్నట్లయితే ఆస్తమా బాధించదు. రాత్రివేళ, ఉదయం సమయాల్లో శ్వాసకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఎక్కువ శారీరక శ్రమలేకుండా చూసుకోవడం అవసరం. దుమ్ము, ధూళి, పొగ, చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాలు, ప్లాస్టిక్‌బ్యాగ్స్, కార్పెట్స్, బెడ్‌షీట్స్, బ్లాంకెట్స్‌లలో డస్ట్‌మైట్స్(చిన్న పరాన్నజీవులు) ఉంటాయి. కాబట్టి పదిరోజులకొకసారి ఎండలో వేయడం, శుభ్రంగా ఉతుక్కోవడం చేయాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. తేమ ఎక్కువగా ఉంటే డస్ట్‌మైట్స్ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముఖానికి చేతిరుమాలు కట్టుకోవడం చేయాలి.

హోమియోవైద్యం
ఆస్తమాకు హోమియోలో చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. ముఖ్యంగా పిల్లల్లో కలిగే అలర్జీలు, శ్వాసకోశ ఇబ్బందులు, శారీరక, మానసిక విశ్లేషణ ద్వారా తగిన మందులను ఇచ్చి చికిత్స అందించడం జరుగుతుంది. హోమియోతో ఆస్తమా వ్యాధిని సమూలంగా తగ్గించే వీలుంది. ఆంటిమెనిమ్ ఆర్స్, ఆర్సెనిక్ ఆల్బ్, సాబుకస్, స్పాంజియా, నేట్రంసల్ఫ్, ఆరేలియా, కార్బోలేజ్ వంటి మందులు ఆస్తమాకు చక్కగా పనిచేస్తాయి.

నివారణ
బ్రాంకోడైలేటర్స్, కార్టికోస్టిరాయిడ్స్, యాంటీబయోటిక్స్, నాసిల్ స్ప్రే మందులు వాడితే మంచి ఉపశమనం కలుగుతుంది. కానీ వీటివల్ల భవిష్యత్తులో వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. వీటిని దీర్ఘకాలికంగా వాడటం వల్ల దుష్ఫ్రభావాలు కలుగుతాయి. పిల్లల్లో పెరుగుదల ఆగిపోవడంతో పాటు మానసిక ఆందోళన, బరువు పెరగడం, జ్ఞాపకశక్తి లోపించడం వంటి సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది. ఆస్తమాను మెడిటేషన్, యోగా ద్వారా చాలా వరకు నివారించవచ్చు. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం, స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్న ప్రదేశాలలో నివసించడం అలవాటు చేసుకోవాలి. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉంటే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను అధిగమించవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top