మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే..

మేకప్ వేసుకునేప్పుడే తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు ముఖంపై ఎక్కువసేపు మేకప్ నిలిచేలా చేయడమే కాకుండా మంచి లుక్‌ని కూడా ఇస్తాయి. అవి... ఈ నూనె చర్మం ఉన్న వాళ్లు యాస్ట్రింజెంట్ లోషన్ వాడితే ఎక్కువసేపు మేకప్ పోకుండా ఉంటుంది. అందుకని యాస్ట్రింజెంట్ లోషన్ రాసుకున్న కొన్ని నిమిషాల తరువాత ఫౌండేషన్ రాసుకోవాలి.

* ఆ తరువాత ఐస్‌క్యూబ్‌ను శుభ్రమైన బట్టలో చుట్టి ముఖంపై కొన్ని సెకన్ల పాటు రుద్దుకోవాలి.
* ముఖం, మెడపై పౌడర్ రాసుకున్న తరువాత నీటిలో ముంచిన స్పాంజ్‌తో అద్దాలి. ఇలా చేయడం వల్ల పౌడర్ ఎక్కువసేపు ముఖంపై నిలిచిపోతుంది.
* కాంపాక్ట్ పౌడర్ వాడడం బెటర్. ఇదయితే మేకప్ వేసుకున్న తరువాత ముఖం మృదువుగా కనిపిస్తుంది.
* మేకప్ పూర్తయిన తరువాత బ్లాటింగ్ పేపర్‌తో ముఖాన్ని సున్నితంగా అద్దాలి.
* లిప్‌స్టిక్ ఎక్కువకాలం ఉండాలంటే ఫౌండేషన్‌ను పెదవులపై పూసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top