చేదు జ్ఞాపకాలకు మందు

'కాలం గాయాన్ని మాన్పుతుంది' - అంటారు. కాని మనసుపొరల్లోని చేదు జ్ఞాపకాలు ఎప్పుడోకప్పుడు కదిలి ఇబ్బందిపెడుతూనే ఉంటాయి. ఇలాంటప్పుడు 'మరుపన్నది లేదా మనసుకి' అని పాటలు పాడుకుంటూ దుర్వ్యసనాలకు చేరువ కాకుండా ఒక మాత్ర మింగితే సరిపోతుందట. చేదు జ్ఞాపకాలు పదే పదే ఇబ్బందిపెట్టకుండా ఉండేందుకు మెటిరోపోన్ అనే మెడిసిన్ కనుగొన్నారు మాంట్రియల్ యూనివర్శిటీ పరిశోధకులు. చేదు జ్ఞాపకాలు గుర్తురాకుండా చేయడంలో ఈ డ్రగ్ సమర్ధవంతంగా పనిచేస్తుందట.

మరుగున పడిన విషయాలను తవ్వితీయడంలో స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్‌ది ప్రధాన పాత్ర. ఈ హార్మోన్ మోతాదును మెటిరోపోన్ తగ్గిస్తుంది. ఎలాగూ కొత్త జ్ఞాపకాలు మెదడులోకి చేరుకుంటాయి కాబట్టి నెగెటివ్ భావాలు వాటంతటవే తుడిచిపెట్టుకుపోతాయనేది పరిశోధకుల భావన. పోస్ట్ ట్రమాటిక్ డిజార్డర్‌తో బాధపడే పేషెంట్లకు ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుందట. మొత్తంమీద ఈ డ్రగ్‌తో పాత జ్ఞాపకాలను తుడిచేసి కొత్త జ్ఞాపకాలు రాసుకోవచ్చన్నమాట.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top