కూల్‌డ్రింక్స్......జాగ్రత్తలు

మండే ఎండలో చల్లటి పానీయాలు తీసుకోవడం సర్వసాధారణం. అందునా అడుగడుక్కీ కన్పించే అందమైన ఏరేటెడ్ డ్రింక్స్‌వైపే దృష్టి వెళుతుంది. ప్రకృతి సిద్ధమైన కొబ్బరి బోండాలు, చెరకు రసం కన్పిస్తున్నా, కూల్‌డ్రింక్స్ తాగడం స్టేటస్ సింబల్‌గా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. శీతల పానీయాల్లో కలిసే కొన్ని పదార్థాల వల్ల అనేక అనారోగ్యాలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిల్లో బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ (బివిఓ) అనే రసాయనం ఉంటుంది. డ్రింక్‌లో కలిసే పదార్థాలు అడుక్కి వెళ్ళకుండా చేయడానికి దీన్ని వాడతారు.

ఇది శరీరంలోని ముఖ్యమైన భాగాలపై ప్రభావం చూపిస్తుందని అనేక దేశాల్లో వైద్య నిపుణులు రుజువు చేశారు. కొన్ని దేశాల్లో ఈ రసాయన వాడకంపై నిషేధాలు కూడా విధించారు. కానీ ఇప్పటికీ బివి ఓ రసాయనాన్ని కూల్‌డ్రింక్స్‌లో వాడుతూనే ఉన్నారు. ఈ రసాయనం యాసిడ్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో జీర్ణకోశ వ్యవస్థ తొందరగా దెబ్బతింటుంది. అంతేకాదు కాలేయం, కిడ్నీలు పాడయిపోతాయి. దీనివల్ల క్యాన్సర్ కూడా కలగవచ్చని బ్రిటన్‌కు చెందిన ఓ వైద్య పరిశీలనలో తేలింది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో 80 శాతం మంది కూల్‌డ్రింక్స్ తాగిన వాళ్ళే ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది.



ఇక తక్కువ ధరకు లభించే లోకల్ బ్రాండ్స్ గురించి చెప్పనక్కర్లేదు. కొన్ని కంపెనీలు కూల్‌డ్రింక్స్ తయారీకి శాక్రిన్ వంటి పదార్థాలు ఉపయోగిస్తున్నాయి. ఇది కలిగించే మత్తు వల్ల మెదడులోని కణాలు మొద్దుబారే అవకాశం ఉన్నట్టు లండన్ పరిశోధనల్లో తేలింది. దీనివల్ల బుద్ధి మాంద్యం, గుండెజబ్బు, దంతాలపై ఎనామిల్ దెబ్బతినడం, కామెర్లు, అతిసార వ్యాధి బారినపడటం వంటి సమస్యలు వస్తాయి. ఏదేమైనా కూల్‌డ్రింక్స్ కన్నా గ్లాసుడు మజ్జిగో, కొబ్బరి నీళ్ళో తాగడం ఉత్తమం. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top