డిప్రెషన్ - కారణాలు - హోమియో చికిత్స

డిప్రెషన్ అనేది ఒక విధమైన మానసిక వ్యాధి. ఏదో తెలియని బాధ, నిరాశ, ఏ పనీ చేయాలనిపించకపోవటం, నిస్సత్తువ, నిద్రలేమి, ఆకలి మందగించటం, దేనిమీదా ఆసక్తి లేకపోవడం వంటివి దీని లక్షణాలు. సకాలంలో దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఇది ఆత్మహత్యకి కూడా దారితీయవ చ్చు. దీని లక్షణాలు కొన్ని నెలలు లేదా సంవత్సరాల వరకు ఉండవచ్చు. 

రకాలు: డిప్రెషన్‌ను ముఖ్యంగా మేజర్ డిప్రెషన్, డిస్థీమియా, బైపోలార్ డిజార్డర్ అని మూడు రకాలుగా విభజించవచ్చు.
మేజర్ డిప్రెషన్: ఇది చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. ఇది కొంతమందిలో జీవితంలో ఒక సారే వస్తుంది. కాని కొంతమందిలో ఇది జీవితాంతం ఉంటుంది. ఇది వ్యక్తి జీవిత విధానంపైనా, చదువు, నిద్ర, ఆహార విహారాలు, ఇతర పనులపై కూడా ప్రభావం చూపుతుంది.
డిస్థీమియా: ఇది మేజర్ డిప్రెషన్ కన్న తక్కువ స్థాయిలో ఉంటుంది. కాని ఇది కూడ చాలా సంవత్సరాల పాటు ఉంటుంది. దీనితో బాధపడేవారు తమ రోజూవారి పనులను నిర్వహిస్తారు కాని ఉత్సాహంగా చేయలేరు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా, నిరుత్సాహంగా కనిపిస్తారు.
బైపొలార్ డిప్రెషన్: దీనితో బాధపడే వ్యక్తులు మానిక్‌గా మారతారు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే పిచ్చిగా ఉంటారన్నమాట. పరిసరాల జ్ఞానం, తమ మీద తాము పూర్తిగా అదుపు కోల్పోతారు.
కారణాలు: డిప్రెషన్‌కి జన్యుపరమైన, వాతావరణపరమైన మార్పులతోబాటు సామాజిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన బాధల వలన, దాంపత్య సమస్యలు, దగ్గరి వ్యక్తులు చనిపోవటం లేదా దూరమవటం, కొన్ని రకాలైన మందులు, స్టిరాయిడ్స్ వాడకం.  



ముఖ్య లక్షణాలు: బాధ, ఆందోళన, తప్పు చేశాననే భావన, కోపం, చికాకు, నిరాశ, త్వరగా అలసరిపోవటం, నిద్రలేమి లేదా విపరీతంగా నిద్రపోవటం, దేని మీదా ఆసక్తి చూపకపోవటం, బరువు విపరీతంగా తగ్గిపోవటం లేదా విపరీతంగా బరువు పెరగటం. తలనొప్పి, జీర్ణసంబంధ వ్యాధులు, చనిపోవాలనే ఆలోచనలు, ఆత్మహత్యా ప్రయత్నాలు చేయటం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం, భవిష్యత్తులో ఏదో విపరీతమైన మార్పులు సంభవిస్తాయన్న భావన మొదలైనవి.
సాధారణ చికిత్స: కౌన్సిలింగ్, యాంటి డిప్రెసెంట్ మందుల ద్వారానూ, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ ద్వారా మెదడులో రసాయన మార్పులు తీసుకు రావడం, శారీరక శ్రమ, మెడిటేషన్ వంటి వాటిద్వారా తగ్గించవచ్చు.
హోమియో చికిత్స: బెల్లడోనా, కోనియం, ఆర్జెంటమ్ నైట్రికమ్, హయోసయామస్, స్ట్రామోనియం మొదలైన మందులను రోగ లక్షణాలను బట్టి నిపుణులైన హోమియో వైద్యుని ఆధ్వర్యంలో వాడటం ద్వారా డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top