సుఖమయమైన నిద్రకు......కొన్ని సలహాలు...

సుఖంగా, హాయిగా నిద్రపోయిన వారు ఎలాంటి సమస్యలు లేకుండా రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఒక్కరోజు సరైన నిద్ర లేకపోతే రోజంతా చికాకుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణులు, మెదటసారి ప్రసవం అయిన చాలా మంది వారి వయస్సుతో పాటు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు.

ప్రసవం అయినవారు వారంలో రెండు మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.వర్కింగ్‌డేస్‌లో ఏడుగంటల ఇరవై నిమిషాలపాటు, సెలవు దినాలలో ఎనిమిది గంటల ఇరవైనిమిషాలసేపు నిద్రపోతున్నారు. పని ఒత్తిడి, లైఫ్‌స్టైల్‌, డిప్రెషన్‌ నిద్రపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నిద్ర సరిపోని వారు తిండి, పని వంటి విషయాలపై ఆసక్తిని కోల్పోతున్నారని తేలింది.
కొన్ని సలహాలు...

  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకే సమయంలో పడుకోవాలి. ఒకే సమయంలో నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.
  • నిద్రకు ఉపక్రమించడానికి మూడు గంటల ముందు వ్యాయామం చేస్తే మంచి నిద్రపడుతుంది.
  • పడుకొనే ముందు కాఫీ, ఆల్కహాల్‌ సేవించడం వంటివి చేయకూడదు.
  • పడకగదిలో ఆరోమా కాండిల్స్‌ను వెలిగించుకోండి. వీటి నుంచి మంచి సువాసన వస్తుంది. సుఖంగా నిద్ర పడుతుంది.
  • పడుకునే ముందు మీకిష్టమైన మ్యూజిక్‌ను వినండి. తక్కువ సౌండ్‌తో సంగీతం వింటే ఇట్టే నిద్రలోకి జారుకునేలా చేస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top