ముక్కు, పెదవుల సౌందర్యాన్ని చక్కదిద్దుకోవడం కోసం చేసే శస్త్రచికిత్స

ముక్కు సౌందర్యాన్ని చక్కదిద్దుకోవడం కోసం చేసే శస్త్రచికిత్సను రైనోప్లాస్టీ అంటారు. ముక్కు మధ్యన ఉండే దూలం లేదా ముక్కు రంధ్రాలు రెండింటినీ విడదీసే గోడని సెప్టమ్ అంటారు. ఈ దూలం/సెప్టమ్ వంకరగా ఉండటం వల్ల చాలామందిలో శ్వాస సమస్యలు ఉంటాయి. ఈ సెప్టమ్‌లోని వంకరను చక్కదిద్దుకోవడంతో పాటు, ముక్కు అందాన్ని తాము కోరినట్లుగా తీర్చిదిద్దుకునే సర్జరీని సెప్టోరైనోప్లాస్టీ అంటారు.

ఏ వయసులో... ఎందుకు...?

రైనోప్లాస్టీని ఏవయసులోనైనా ఎప్పుడైనా చేయించుకోవచ్చు. అయితే అమ్మాయిల్లో 15, 16 ఏళ్లు దాటాక, అబ్బాయిల వయసు 16, 17 దాటాక చేయించుకుంటే మంచిది. ఎందుకంటే... అప్పటికి ముక్కు సాధారణ పెరుగుదల పూర్తి అవుతుంది. దాని స్వాభావికమైన పెరుగుదల పూర్తయ్యాక శస్త్రచికిత్స చేయించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం.

రైనోప్లాస్టీలో ఏయే శస్త్రచికిత్సలు...

* ముక్కు ఎత్తు పెంచడం: 
సాధారణంగా చాలా మందిలో ముక్కు తగినంత ఎత్తు లేకపోవడం వల్ల పొట్టిగా ఉంటుంది. దీన్నే వాడుకలో చట్టిముక్కు అని వ్యవహరిస్తుంటారు. దీన్ని పెంచుకోడానికి శస్త్రచికిత్స చేయించుకోవచ్చు.
* ముక్కుపొడవు తగ్గించడం: 

ముక్కు చాలా పొడవుగా ఉన్నప్పుడు తగ్గించుకోవడం కోసం
* ముక్కుకొనను తీర్చిదిద్దడం:

కొందరిలో ముక్కుకొన మందంగా, ఉబ్బినట్లుగా ఉంటే (బల్బస్ నోస్) తగ్గించడం కోసం
* వంకరముక్కును సరిచేయడం: 

ముక్కు ఒక వైపునకు వంగినట్లుగా ఉంటే దాన్ని చక్కగా ఉండేలా చేయడం...

సరిచేయాల్సిన సమస్యలివి...
* ఇక ముక్కుకు ఉన్న వంకర సరిచేయడానికి ముక్కు ఎముకను సరి చేయాల్సి ఉంటుంది. దానికి సరైన పద్ధతిలో ఒక ఆకృతి కల్పించాల్సి (రీమౌల్డ్ చేయాల్సి) ఉంటుంది.
* ముక్కు చివరి భాగం ఉబ్బినట్లుగా (బల్బస్ నోస్) ఉంటే ఈ చివరన ఉండే కొవ్వు తొలగించడమో లేదా అక్కడ మందంగా ఉన్న చర్మాన్ని పలుచన చేయడం వంటి పద్ధతులతో దాన్ని సరిచేయవచ్చు. 


ఇక కృత్రిమ పదార్థాలను ఉపయోగించే పరిస్థితిలో సిలికాన్ లేదా మెడ్‌పోర్/పోరస్ మెటీరియల్స్ ఉపయోగిస్తారు. స్పాంజిలా పూర్తిభాగం రంధ్రాలురంధ్రాలుగా ఉండే పదార్థాన్ని పోరస్ అంటారు. ఈ కృత్రిమ పదార్థాలతో ఆపరేషన్ తర్వాత ఫలితం బాగున్నా శరీరం దాన్ని స్వీకరించకపోవడం, కొద్ది కాలం తర్వాత వంకరపోవడం వంటి సమస్యలు ఉంటాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు స్వాభావికమైన వాటినే శస్త్రచికిత్సలో ఉపయోగిస్తారు. వీళ్లలో ఫిట్‌నెస్‌కు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి ఇతర సర్జరీలలోలాగా అనస్థీషియాతో ఉండే రిస్క్‌లు, కాంప్లికేషన్లు ఏర్పడవు.

సర్జరీ ప్రక్రియ... జాగ్రత్తలు:
* రైనోప్లాస్టీ ప్రక్రియకు ఒకటి, రెండు గంటల సమయం పడుతుంది.
* అవసరాన్ని బట్టి లోకల్ / జనరల్ అనస్థీషియా ఇస్తారు.
* ముక్కులోపలా, బయటా డ్రస్సింగ్ చేస్తారు. అదే రోజు లేదా కొందరిని సర్జరీ మర్నాడు డిశ్చార్జ్ చేయవచ్చు.
* వారం పాటు యాంటీబయాటిక్స్, నొప్పినివారణ మందులు వాడాల్సి ఉంటుంది.
* ఐదు రోజుల తర్వాత డ్రస్సింగ్ తొలగిస్తారు. వాపు క్రమంగా తగ్గుతుంది.

పెదవులు: 

వయసు పెరుగుతున్న కొద్దీ పెదవులు పలచబడి సన్నగా మారడం సహజంగా జరుగుతుంది. కొందరిలో పెదవులు మరింత సన్నగా ఉంటే వాటిని సరిచేయడం కోసం కాస్త లావు పెంచడానికి అవసరమైన చికిత్స చేస్తారు. ఇందులో గాటు అవసరం లేని విధంగా చేసే చికిత్సలో ‘ఫిల్లర్స్’ అనే పదార్థాన్ని అమర్చుతారు. ఈ ఫిల్లర్స్ రెండు రకాలు. 
1. తాత్కాలిక ఫిల్లర్స్
2. శాశ్వత (పర్మినెంట్) ఫిల్లర్స్ .

తాత్కాలికమైన ఫిల్లర్స్ ఆర్నెల్ల పాటు ఉపయోగపడతాయి. పర్మనెంట్ ఫిల్లర్స్ ఉపయోగపడే వ్యవధి నాలుగేళ్లకు మించి ఉండదు. ఆ ఫిల్లర్స్ ప్రభావం తగ్గగానే... మళ్లీ మళ్లీ చేయించుకుంటూ ఉండాలి.

ఇక లావుగా ఉన్న పెదవులను సరిచేయించడానికి కూడా ప్లాస్టిక్ సర్జరీ సహాయం తీసుకోవచ్చు. చాలామంది కింది పెదవి లావుగా ఉందనో లేదా పెదవులు రెండూ లావుగా ఉన్నాయనో, దాన్ని తగ్గించుకోవాలనుకుంటారు. ఇలా పెదవుల లావు తగ్గించడానికి చేసే ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్సను లిప్ రిడక్షన్/రిడక్షన్ కీలోప్లాస్టీ అం టారు. దీన్ని స్థానికంగా ఇచ్చే అనస్థీషియా సహా యంతో చేయవచ్చు. ఈ ప్రక్రియలో పెదవిలో ఉండే మూడు పొరల కణజాలాన్ని తొలగిస్తారు.

ఇవేగాక నోరు అవసరమైన దానికంటే ఎక్కువ వెడల్పుగా ఉందనో లేదా తగినంత వెడల్పుగా లేదనో కూడా ప్లాస్టిక్ సర్జన్‌లను సంప్రదిస్తుంటారు.

సౌందర్యాన్ని ఇనుమడింప జేసుకోవడం కోసం చేయించుకునే ఏ శస్త్రచికిత్స అయినా సరే... వాటి తర్వాత లభ్యమయ్యే సౌకర్యాలు, వాటిలో ఉండే రిస్క్‌లు వంటి అనేక అంశాలను డాక్టర్‌తో, మిత్రులతో చర్చించాకే ఒక నిర్ణయం తీసుకోవడం అన్నివిధాలా మంచిది.


గ్రహణం మొర్రి...
పుట్టుకతో వచ్చే గ్రహణం మొర్రి సమస్య వల్ల చాలా మందికి పెదవులలో (చాలా మందికి పై పెదవిలో) చీలిక ఏర్పడుతుంది. దీనికి పిల్లల్లో చిన్నప్పుడే చీలిన పెదవిని అతికించే శస్త్రచికిత్స చేసినా మళ్లీ వాళ్ల వయసు 15 దాటాక ముక్కు రంధ్రాలలో లోపం, పెదవుల ఆకృతిలో తేడా ఉంటుంది. ఎందుకంటే... ఈ వయసు వరకు స్వాభావికంగా అన్ని అవయవాలు పెరుగుతుండటం, చిన్నప్పుడు శస్త్రచికిత్సతో వచ్చే ఆ తేడా ఎదుగుదలలో ప్రక్రియలోనూ కొనసాగడం వల్ల ముక్కు రంధ్రాల షేప్‌లు ఒకేలా లేకపోవడం, ఆకృతిలో మార్పు వంటి తేడాలు వస్తాయి. ఎదిగాక ఆ తేడాలను మళ్లీ సరిచేయాల్సి ఉంటుంది.

సరిదిద్దగల లోపాలు

రైనోప్లాస్టీ విధానంతో ఈ కింద పేర్కొన్న లోపాలను సరిచేయవచ్చు.
* ముక్కు ఎదుగుదలలో లోపం వల్ల దాని ఆకృతి సాధారణంగా లేకపోవడం.
* ఏదైనా ప్రమాదాని (యాక్సిడెంట్)కి గురై ముక్కు ఆకృతి దెబ్బతిన్నప్పుడు
* లెప్రసీ, సార్కాయిడోసిస్ వంటి వ్యాధులు వచ్చి ముక్కు కుదించుకుపోయి (ష్రింక్ అయి), దాని ఆకృతి అసహ్యంగా మారినవారికి.... ఈ శస్త్రచికిత్స చేయవచ్చు. రైనోప్లాస్టీ విధానంతో ఈ కింద పేర్కొన్న లోపాలను సరిచేయవచ్చు.
* ముక్కు ఎదుగుదలలో లోపం వల్ల దాని ఆకృతి సాధారణంగా లేకపోవడం.
* ఏదైనా ప్రమాదాని (యాక్సిడెంట్)కి గురై ముక్కు ఆకృతి దెబ్బతిన్నప్పుడు
* లెప్రసీ, సార్కాయిడోసిస్ వంటి వ్యాధులు వచ్చి ముక్కు కుదించుకుపోయి (ష్రింక్ అయి), దాని ఆకృతి అసహ్యంగా మారినవారికి.... ఈ శస్త్రచికిత్స చేయవచ్చు.

ముక్కు శస్త్రచికిత్స- అపోహలు, వాస్తవాలు

ముక్కుకు చేసే శస్త్రచికిత్స వల్ల మచ్చలు ఏర్పడతాయని అపోహ. అయితే ఇది కాస్మటిక్ శస్త్రచికిత్స కావడంతో బయటకు గాటు కనిపించకుండా చేస్తారు. ముక్కు చేసే పనులకు ఆటంకం ఉంటుందని అపోహ. కానీ ముక్కు చేసే పనులైన శ్వాస తీసుకోవడం, వాసన చూడటం వంటి విధులకు ఆటంకాలు రావు. కృత్రిమంగా ప్లాస్టిక్ వస్తువులను ముక్కులో అమర్చుతారని అపోహ. కానీ... చాలామట్టుకు ముక్కు ఎత్తును పెంచే ప్రక్రియలో మాత్రం స్వాభావికమైన పదార్థాలనే ఉపయోగిస్తారు. చెవి (ఇయర్ పిన్నా) కార్టిలేజ్ గానీ, లేదా ఇతర శరీర భాగాలనుంచి సేకరించిన మృదులాస్థి (కార్టిలేజ్)ని మాత్రమే ముక్కు ఎత్తును పెంచడానికి ఉపయోగిస్తారు.

ఖర్చు
ఆసుపత్రిని, డాక్టర్‌ను బట్టి రైనోప్లాస్టీ, పెదవులను చక్కదిద్దే కీలోప్లాస్టీకి రూ. 25వేల నుంచి రూ. 60 వేల వరకు ఖర్చు అవుతుంది.    
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top