టాన్సిల్స్‌కు హోమియో చికిత్స

టాన్సిల్స్, అడినాయిడ్స్, సైనసైటిస్ వల్ల జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. దీనివల్ల ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, పిల్లలు చదువుపై సరియైన శ్రద్ధ చూపించకపోవడం జరుగుతుంది. యాంటీబయోటిక్స్ మందులు వాడితే సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప పూర్తి పరిష్కారం లభించదు. హోమియోలో ఈ సమస్యలకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి.
 

పిల్లలలో ఎక్కువగా కనిపించే సమస్య టాన్సిల్స్. వీటితో పాటు అడినాయిడ్స్, నాసల్ పాలిప్స్, సైనసైటిస్ వంటి సమస్యలు కూడా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్యలకు శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని చాలా మంది అనుకుంటారు. కానీ హోమియోలో వీటికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి శస్త్ర చికిత్సలేకుండా సమస్యను తగ్గించే వీలుంది.


టాన్సిల్స్
టాన్సిల్స్ వల్ల చిన్న పిల్లలలో తరచుగా జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. దీనివల్ల ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, చదువుపై సరియైన శ్రద్ధ చూపించకపోవడం జరుగుతుంది. యాంటీబయోటిక్స్ మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప పూర్తి పరిష్కారం లభించదు. గొంతుకు ఇరువైపులా ఉండే టాన్సిల్స్‌కు ఇన్‌ఫెక్షన్ వచ్చినపుడు ఎర్రగా మారి వాచిపోతాయి. బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వస్తే చీము కూడా చేరుతుంది.

లక్షణాలు
గొంతునొప్పి, జ్వరం, గురక, ముక్కు దిబ్బడ, లింఫ్‌గ్రంథుల వాపు, ఆహారం నమలడం కష్టంగా మారడం, నిద్రలో శ్వాస సరిగ్గా ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

హోమియో మందులు
బెల్లడొనా : టాన్సిల్స్ ఎర్రగా వాచిపోయి ఉంటాయి. నొప్పి, ఆహారం మింగడం కష్టంగా ఉంటుంది. తరుచూ జ్వరం, లింఫ్‌గ్రంథి వాచి ఉండటం, చల్లగాలి తగిలినపుడు బాధ ఎక్కువవడం, కోపం, చిరాకు, పుల్లటి పదార్థాలను ఇష్టపడటం వంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు మంచి ఔషధం. మెర్క్ఐడ్ రూబ్రమ్ : టాన్సిల్స్ కంఠ భాగం ఎర్రగా ఉంటుంది. ఆహారం మింగడంలో ఇబ్బంది, గొంతులో కఫం అడ్డుపడటం, మెడ కండరాలు పట్టేసినట్లుగా ఉండటం, టాన్సిల్స్‌పై చీము చేరడం, దగ్గు, గొంతు బొంగురు పోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు ఇవ్వవచ్చు. దీనికి తోడు రోగి శారీరక మానసిక స్థితిని బట్టి కానిస్ట్యూషనల్ చికిత్స అందించాల్సి ఉంటుంది.



అడినాయిడ్స్
వీటిని నాసోఫారింజియల్ టాన్సిల్స్ అంటారు. ముక్కు వెనుక భాగంలో గొంతులో కలిసే చోట ఉండే స్పాంజిలాంటి చిన్న కణజాలం. ఇది ముఖ్యంగా వైరస్, బాక్టీరియా క్రిములను శుద్ధిచేసే ఫిల్టరులాంటిది. ఐదేళ్ల తరువాత పిల్లలలో ఇది క్షీణింపబడుతుంది.

లక్షణాలు
శ్వాసలో ఇబ్బంది, ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి రావడం, ముక్కు నొక్కిపెట్టి మాట్లాడినట్లుండటం, శ్వాస శబ్దంతో కూడి ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. గురక, నిద్రలో ఉలిక్కిపడి లేచుట, శ్వాస సరిగ్గా అడకపోవడం, చెవిలో శబ్ధములు, గురక, చెవిలో చీము, గొంతునొప్పి తదితర లక్షణాలు కూడా కనిపిస్తాయి.

హోమియో చికిత్స
కాల్కేరియా ఫాస్, కాల్కేరియా అయిడ్, ఐయోడియమ్, మెర్స్‌సాల్, ట్యుబర్కిలినమ్ వంటి మందులు బాగా పనిచేస్తాయి. కాల్కేరియా ఫాస్ మందు వాడటం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అడినాయిడ్ వాపు తగ్గుతుంది. శ్వాసలో ఇబ్బందులు, గురక, నిద్రలేమి, చెవి బాధలు తగ్గుతాయి.


 సైనసైటిస్
ముక్కు భాగంలో ఉండే సన్నని ఖాళీ ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఇన్‌ఫెక్షన్స్, పొల్యూషన్ చేరడం వల్ల సైనస్‌లో ఇన్‌ఫెక్షన్ ప్రారంభమవుతుంది. తలనొప్పి, తల భారంగా ఉండటం, తుమ్ములు, జలుబు, ముక్కు నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ, నోటిలోకి ద్రవం రావడం, ఒళ్లు నొప్పులు, చెవినొప్పి, జ్ఞాపకశక్తి తగ్గడం, నిద్రలేమి వంటి లక్షణాలు ఉంటాయి. ఆపరేషన్ చేసినా సైనస్ సమస్య మళ్లీ బాధపెడుతూనే ఉంటుంది.

హోమియో మందులు
బ్రయోనియా : కోపం, చిరాకు, భరించలేని తలనొప్పి, గట్టిగా అదిమిపట్టినప్పుడు ఉపశమనంగా ఉండటం, ముక్కులో రక్తం కారడం, శ్వాస ఆడకపోవడం, ఫ్రాంటల్ సైనస్‌లోనొప్పి, కళ్లు తిప్పినా నొప్పిగా ఉండటం, జలుబు, గొంతు తడారి నట్టుగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు బాగా పనిచేస్తుంది.

కాలిబైక్ :

కనుబొమ్మల వద్ద నొప్పి, చూపులో ఇబ్బందులు, ముక్కుకు ఇరువైపులా నొప్పి, ఎముక భాగంలో నొప్పి, కుడివైపు కనుభాగంలో నొప్పి, ముక్కుదిబ్బడ, వాసన తెలియకపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన ఔషధం. వీటితో పాటు సాంగ్వినేరియా, కాల్కేరియా కార్బ్, మెర్క్‌సాల్, కాలిఐయిడ్, బెల్లడొనా మందులను వాడవచ్చు. ఈ మందులను హోమియో వైద్యుల పర్యవేక్షణలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top