కేలరీలు తగ్గించే 12 పనులు

'నడుమెక్కడే నీకు నవలావణి' అని అన్పించుకోవాలని కోరుకోని మహిళలుండరు. అందానికే కాదు, ఆరోగ్యానికి కూడా వరంలాంటిది నాజూకుదనం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో స్లిమ్‌నెస్‌కే పెద్దపీట. కానీ కొంతమంది స్థూలకాయులకు ఇది అందని ద్రాక్ష అవుతున్నది. రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాల వ్యాధులకు స్థూలకాయులంటే ఎంతో ముద్దు. అందుకే ఇలాంటి సమస్యలు తలెత్తిన తర్వాత బాధపడేకన్నా అతిగా లావు కాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం మేలు.

రోజంతా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండాలంటే బరువు పెరిగిపోకుండా నియంత్రించుకోవడం ఉత్తమమైన మార్గం. చాలామంది బరువు తగ్గడానికి తిండి తగ్గించడం ఒక్కటే మార్గం అనుకుని డైటింగులు మొదలుపెడతారు. కానీ డైటింగులు చేయడం వల్ల పోషకాహారలోపం ఏర్పడి, మరిన్ని ఇతర సమస్యలకు దారితీస్తుంది. మరి ఈ సమస్యను అధిగమించడం ఎలాగని చింతిస్తున్నారా..? డోంట్‌వర్రీ..! ఏకంగా 150 కేలరీలను తగ్గించుకోవడానికి పన్నెండు సూత్రాలను ఇస్తున్నాం. జాగ్రత్తగా ఫాలో అయితే నాజూకైన దేహం మీసొంతం.
సో.. క్యారీఆన్...
చేయవలసిన పని కేటాయించవలసిన సమయం
1. కారుకు వాక్సింగ్/శుభ్రం చేయడం 45 నుంచి 60 నిమిషాలు
2. కిటికీలు/ నేలను శుభ్రం చేయడం 45 నుంచి 60 నిమిషాలు
3. వాలీబాల్ ఆడడం 45 నిమిషాలు
4. తోటపని చేయడం 30 నుంచి 45 నిమిషాలు
5. ఒకటి ముప్పావు మైలు నడవడం 35 నిమిషాలు (20నిమిషాలు/మైలు)
6. 5 మైళ్లు సైకిలు తొక్కడం 30 నిమిషాలు
7. వేగంగా నృత్యం చేయడం 30 నిమిషాలు
8. రెండు మైళ్ల నడక 30 నిమిషాలు (15నిమిషాలు/మైలు)
9. స్విమ్మింగ్ 20 నిమిషాలు
10. స్కిప్పింగ్ 15 నిమిషాలు
11. ఒకటిన్నర మైలు పరుగెత్తడం 15 నిమిషాలు(10నిమిషాలు/మైలు)
12. మెట్లు ఎక్కడం 15 నిమిషాలు 


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top