సమ్మర్ స్పెషల్ సలాడ్


కావలసిన పదార్థాలు
పెరుగు - ఒక గ్లాసు, దోసకాయలు - ఆరు, టమోటా - ఒకటి, బంగాళదుంప - ఒకటి, ఉప్పు - తగినంత, మిరియాలు - చిటికెడు.

తయారుచేసే పద్ధతి
ముందుగా దోసకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. బంగాళదుంపను మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దోసకాయలతో కలుపుకోవాలి. టమోటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు, తగినంత ఉప్పు వేసుకుని, చిటికెడు మిరియాలు వేసి బాగా కలియబెట్టుకోవాలి. అంతే... సమ్మర్ స్పెషల్ సలాడ్ రెడీ. ఈ సలాడ్ చల్లదనంతో పాటు ఆరోగ్యాన్నిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top