ఉగాది పచ్చడి


పులుపు : కొత్త చింతపండు - 50 గ్రాములు
తీపి : కొత్త బెల్లం - 200 గ్రాములు
కారం : కారం - చిటికెడు
ఉప్పు : ఉప్పు- చిటికెడు
చేదు : వేపపువ్వు - ఒక టీ స్పూను
ఒగరు : మామిడి ముక్కలు - ఒక టేబుల్ స్పూను
తయారుచేయు విధానం:

చింతపండు కాసేపు నానపెట్టుకుని రసం తీసుకోవాలి. అందులో సన్నగా తరగిన బెల్లం, కొద్దిగా ఉప్పు, కారం, వేపపువ్వు, మామిడి ముక్కలు వేసి కలుపుకోవాలి. అంతే...షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ అయినట్టే. అయితే ఈ పచ్చడి ఒక్కో ప్రాంతంలో ఒకో పద్ధతిలో చేస్తారు. తీపి ఎక్కువగా ఇష్టపడేవారు బెల్లంతోపాటు చెరుకు ముక్కలు, అరటిపండు ముక్కలు, ఉడికించిన చిలకడ దుంప ముక్కలు వేసుకుంటారు.

కొందరు పచ్చడిని చాలా పలుచగా చేస్తే కొందరు గట్టిగా చేసుకుంటారు. పలుచగా ఉండే పచ్చడిలో కొందరు పుట్నాలపప్పు కూడా కలుపుతారు. కొంతమంది వేపపువ్వుని నేరుగా వేసేస్తారు. చేదును అంతగా ఇష్టపడని వారు పువ్వుని చేత్తో కొద్దిగా నలిపి చెరగాలి. కాడల్ని తీసేసి ఒట్టి పువ్వునే వెయ్యాలి. అప్పుడు చేదు రాదు. అయితే ఈ పచ్చడి చేసిన వెంటనే తింటే బాగుంటుంది. ఆలస్యమయ్యేకొద్దీ పులుపు పెరిగిపోతుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top