ఏకాగ్రత కోసం...

ఎంతో చేద్దామనుకుంటాను. కానీ, ఏకాగ్రతే కుదరదు. అసలు ఏ ఒక్క విషయం మీదా మనసు నాలుగు నిమిషాలు నిలవదు. ఏం చేయను? అంటూ దిగులు పడిపోయే వారు చాలా మందే కనిపిస్తారు. కానీ, ఏ ఒక్క విషయం మీదా మనసు నిలవదు అంటున్నారూ అంటే మనసులో చాలా విషయాలు ఉన్నట్లే కదా! విషయాలు ఒకటికి మించి మనసులో మకాం వేస్తే వాటిలో ఏదో ఒక్క విషయం మీదే మనసు ఎలా ఉండిపోతుంది?

* ఏకాగ్రత అంటే ఏమిటి? ఎన్నింటితోనో తెగదెంపులు చేసుకుని ఏదో ఒక్కదానికి పరిమితమైపోవడమే. పరిమితమైపోవడం అంటే కుంచించుకుపోవడం ఏమీ కాదు. ఒకే ఒక్కవిషయపు లోలోతుల్లోకి వెళ్లడం, ఆ ఒక్క విషయంలోనే విస్తరించడం.

* విషయాల పైపైన వెళుతున్నప్పుడు మనసు వెనక్కో ముందుకో వెళుతూనే ఉంటుంది. అలా కాకుండా విషయపు లోలోతుల్లోకి వెళుతున్నప్పుడు మనసు అక్కడే ఉండిపోతుంది.


* విషయపు లోలోతుల్లోకి వెళ్లడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ విషయంలోని అపారమైన సౌందర్యాన్ని చూసినప్పుడు. అందులోని మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించినప్పుడు. ఆ విషయపు విస్తృతమైన పరిధిని, దాని వల్ల కలిగే విశాల ప్రయోజనాలను స్పష్టంగా తెలిసినప్పుడు మాత్రమే మనసు లోలోతుల్లోకి వెళుతుంది. అందుకే ముందు ఎంచుకున్న విషయపు సౌందర్య మాధుర్యాలను, ఆ విషయపు పరిధిని, ప్రయోజనాలను తెలుసుకోండి . అప్పుడింక మరో ప్రయత్నం లేకుండానే ఏకాగ్రత దానికదే కుదురుతుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top