వేసవి తీవ్రత నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు.

ఎండలు దంచేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచే మొదలు కావాల్సిన ఎండలు ద్రోణి ప్రభావంతో కాస్త ఆలస్యంగా మొదలయ్యాయి. మరీ నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వేసవి తీవ్రత నుంచి బయటపడేందుకు  కొన్ని చిట్కాలు.
  •  నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, పుచ్చపండు వేసవి తాపాన్ని చల్లారుస్తాయి. ముఖ్యంగా పుచ్చపండులో 92 శాతం నీరు ఉంటుంది. 14 శాతం విటమిన్ - సి, విటమిన్- బి, పొటాషియం ఉంటాయి. పుచ్చపండు తినడం వల్ల చెమటద్వారా మన శరీరం నుంచి బయటకు వెళ్లిపోయిన నీరు మళ్లీ వచ్చిచేరుతుంది. అయితే రోడ్డు పక్కన, ఐస్ మీద ఉంచిన పుచ్చపండ్ల జోలికి వెళ్లకండి. తాజాగా కోసిన పుచ్చపండు శ్రేష్టం. పెద్ద పండును కొనే కంటే ఎర్రటి రంగులో ఉన్న చిన్న పుచ్చపండును తీసుకోవడం మంచిది. పెద్ద పండు కొంటే ఒక దానిని ఒకే రోజులో తినలేం. సగం తిని మిగిలిని సగాన్ని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల పోషకాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
  • వేసవిలో నూనె పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. ఇంట్లో చేసుకున్న నూనె వస్తువులు పరిమితంగా తీసుకోవడం వల్ల నష్టం లేదు కానీ రోడ్డు పక్కన లభించే నూనె పదార్థాలు మరింత హాని చేస్తాయి.
  • మధ్యాహ్నం పూట ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే కళ్లద్దాలు, టోపీ తప్పని సరిగా ధరించాలి. వయోధికులకు ఈ రెండూ మరీ ముఖ్యం. ఇవి లేకుండా బయటకు వెళితే వడదెబ్బ తగిలే ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది.
  • ఫ్రిజ్‌లో ఉంచిన నీళ్లు తాగడం వల్ల ఎంతకూ దాహం తీరదు. కుండలో ఉంచిన నీళ్లు తాగితే దాహం ఇట్టే తీరిపోతుంది.
  • ఎండ పెరిగే లోపే తెరిచి ఉంచిన కిటికీ తలుపులు మూసేయండి. లేకపోతే గదులు త్వరగా వేడెక్కిపోతాయి. పొరపాటున కిటికీ తలుపులు వేయడం మరచిపోవడం వల్ల  గదులు వేడెక్కితే కిటికీలు తెరిచి, తడి గుడ్డను వాటికి కట్టండి. కాసేపటికి గదులు చల్లబడతాయి. ఆ తరువాత కిటికీలు, తలుపులు మూసేస్తే సరిపోతుంది.
  • వేసవి తాపానికి మిరియాలు బాగా పనిచేస్తాయి. మన శరీరం నుంచి నీరు చెమటరూపంలో బయటకు వెళ్లిపోయినా శరీరం చల్లగా ఉండేందుకు మిరియాలు తోడ్పడతాయి. ఈ చిట్కాలు పాటించి వేసవి తాపాన్ని తరిమేస్తారు కదూ?
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top