పాలక్ బ్రెడ్ కట్‌లెట్


కావలసిన పదార్థాలు
బ్రెడ్ ముక్కలు- నాలుగు, పాలకూర - రెండు కట్టలు, పచ్చి మిరపకాయలు - నాలుగు, ఉల్లిపాయలు - రెండు, జీలకర్ర - ఒక స్పూన్, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా, శనగపిండి - కొద్దిగా.

తయారుచేయు విధానం
ముందుగా పాలకూరను సన్నగా తరగాలి. పచ్చి మిరపకాయలను, ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత పాలకూరను ఒక పాత్రలోకి తీసుకుని తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, శనగపిండి ,జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, నీళ్లు పోసి అన్నీ పదార్థాలు కలిసేలా కలుపుకోవాలి. తరవాత బ్రెడ్‌ను రెండు ముక్కలుగా కట్ చేసి కలిపి పెట్టుకున్న మిశ్రమంలో అద్దాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఈ బ్రెడ్ ముక్కలను వేసి వేయించుకోవాలి. అంతే.. పాలక్ బ్రెడ్ కట్‌లెట్ రెడీ. వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడు టమోటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top