వడదెబ్బ తగిలితే.....జాగ్రత్తలు హోమియో మందులు

ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటే ఒకటికి రెండు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. వేసవికాలంలో ఎండలో తిరిగితే వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిర్లక్ష్యం చేస్తే వడదెబ్బ వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు. వేసవి కాలంలో తలెత్తే సాధారణ సమస్య వడదెబ్బ. ఎండలో ఎక్కువగా తిరగడం, తగినంత నీరు తాగకపోవడం, వేడి తగలకుండా సరియైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.

వేడి వల్ల శరీరంలో ఉన్న ఫ్లూయిడ్స్ ఆవిరైపోయి డీ హైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. దీనివల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎండ నేరుగా తగలడం వల్లనే కాకుండా, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పనిచేయడం, వేడి ఎక్కువగా తగిలే అవకాశం ఉన్న రేకుల ఇళ్లలో నివసించడం, ప్రయాణాలు చేయడం వల్ల వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది. ఇనము కరిగించే పని చేసే వారు, పెళ్లిళ్లలో వంట పని చేసే వారు ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బ బారినపడటానికి ఆస్కారం ఉంది.

టెంపరేచర్ మెకానిజం
ఎక్కువ ఎండ లే దా ఎక్కువ వేడి తగిలినపుడు ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసే వ్యవస్థ మన శరీరంలో సహజంగానే ఉంటుంది. మెదడులో ఉండే హైపోథలామస్ అనే గ్రం«థి శరీరంలోకి ప్రసరించే ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. అదేపనిగా ఎండలో తిరిగినపుడు ఈ గ్రంథి పనితీరులో తేడా చోటుచేసుకుంటుంది. ఒక్కోసారి గ్రంథి సరిగ్గా పనిచేయకపోవచ్చు. దాని ఫలితంగానే వడదెబ్బ తగులుతుంది.

లక్షణాలు
వడదెబ్బ తగిలిన వారిలో శరీర ఉష్ణోగ్రత ఒక్కోసారి 105 డిగ్రీల దాకా వెళుతుంది. మానసిక స్థితిలో తేడా వస్తుంది. కలవరపాటుకు లోనవుతుంటారు. శ్వాసక్రియ వేగం పెరుగుతుంది. ఒళ్లంతా తిమ్మిర్లు ఉంటాయి. రక్తపోటు, పల్స్‌రేటు బాగా పెరిగిపోతుంది. ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోతారు. ఈ స్థితిలో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం అయ్యే అవకాశం కూడా ఉంది.





 వడదెబ్బ తగిలితే...
వడదెబ్బ తగిలినపుడు ముందుగా ఆ వ్యక్తి ఒంటి పైన ఉన్న దుస్తులను తొలగించాలి. చల్లగా గాలి వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టాలి. తడి బట్ట లాంటిది కప్పడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లయితే తగ్గించే ప్రయత్నం చేయాలి. వైద్యుల సలహా మేరకు ద్రవపదార్థాలు ఇవ్వాలి.

జాగ్రత్తలు
కాటన్ దుస్తులు ధరించాలి. పసుపు, తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మరీ మంచిది.
నీరు ఎక్కువగా తాగాలి. కొబ్బరి నీరు తీసుకుంటే మేలు.
మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా గొడుగు పట్టుకొని వెళ్లాలి.
వేసవికాలంలో దూరపు ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం.
హోమియో మందులు
బెల్లడోనా-200 :

శరీరం కందిపోయినట్లుగా ఉన్నా, ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నా ఈ మందును ఉపయోగించవచ్చు. అధిక రక్తపోటు వల్ల కళ్లు కందిపోయి, ముఖం ఎర్రబారడం, పల్స్ రేటు పెరిగిపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు బెల్లడోనా 200 పొటెన్సీ మందును ప్రతీ అరగంటకొకసారి ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా నాలుగైదు సార్లు ఇవ్వవచ్చు. ప్రాథమిక దశలో అయితే ఈ మందు బాగా పనిచేస్తుంది.


వెరాట్రం విరిడే -200 : 
తల వేడిగా ఉంటుంది. ముఖం కందిపోయి ఉబ్బినట్లుగా ఉంటుంది. కళ్లు తిరుగుతున్నట్లుగా, తలంతా బరువుగా, వాంతులు వస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఇటువంటి లక్షణాలతో రోగి బాధపడుతున్నప్పుడు వెరాట్రం విరిడే -200 పొటెన్సీ మాత్రలు 15 నుంచి 20 వరకు తీసుకుని అరకప్పు నీళ్లలో నానబెట్టి ఆ నీటిని ప్రతీ అరగంటకొకసారి రెండు చెంచాలు తాగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. వడదెబ్బ తగిలిన నాలుగైదు గంటల తరువాత చికిత్స ఇస్తున్నట్లయితే ఈ మందు బాగా పనిచేస్తుంది.

నేట్రంమూర్-200 : 

దాహం ఎక్కువగా ఉంటుంది. నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరదు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. భరించలేని తలనొప్పితో బాధపడుతుంటారు. ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు నేట్రంమూర్-200 మందును నాలుగైదు డోసులు ఇస్తే సరిపోతుంది. అవసరాన్నిబట్టి అరగంటకొకసారి ఇవ్వచ్చు. పరిస్థితి తీవ్రంగా ఉంటే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించడం మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top