నోటి పూత... కారణాలు

నోరుమంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అది నోటి మాటలకు వర్తిస్తుంది అనుకోండి. కాని నోటిని అపరిశుభ్రంగా ఉంచుకుంటే మాత్రం నోటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే నోరు మన మాట వినదు సరికదా. పైగా నోరే మనలోని జబ్బులను బయటపెడుతుంది. అది ఏమిటి అంటారా? చూడండి....
 

అపుడప్పుడు అందరికీ నోరు పూత వస్తుంటుంది. నోటి పూత కారణంగా నాలుక నోటి లోపలి బుగ్గలు, పెదవులు, ఎర్రగా పూసినట్లు కనిపిస్తుంది. కారం తగిలితే మంట పుడుతుంది. నోటి వెంట లాలాజలం ఊరుతుంది. ఏమి తినాలన్నా నొప్పితో చాలా బాధపడాల్సి ఉంటుంది. నాలిక పైనఅంతా చిన్ని చిన్ని పుండ్లు కూడా వస్తాయి. దీనికి కారణం ముఖ్యంగా నోటి అపరిశుభ్రతే. అంతేకాకుండా ఒక్కోసారి శరీరంలో బికాంప్లెక్ లేమి వలన, వైరస్ వలన, ఫంగస్, బాక్టీరియాల ఇన్‌ఫెక్షన్ కడుపులో పురుగులు, మెటాలిక్ పాయిజినింగ్ దీర్ఘకాలిక అనారోగ్యం, మానసిక ఒత్తిడి, అజీర్ణవ్యాధి, దంతాల వ్యాధులు, ఏదైనా మందులు తీసుకొంటే అవి వికటించినపుడూ ఇలా నోరు పూస్తుంది. కనుక ఎంతైనా మన నోరును మన జాగ్రత్తగా ఉంచుకోవాలి సుమా.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top