సర్వరోగ నివారిణి వెల్లుల్లి

  • మన ఆహారంలో ఉల్లిని తరచుగా ఉపయోగిస్తే, వెల్లుల్లిని అరుదుగా ఉపయోగిస్తుంటాం. కానీ వెల్లుల్లిని వాడటం దీర్ఘకాల ప్రయోజనాన్ని చేకూర్చుతుందని ఆయుర్వేదం చెబుతున్నది.
  • వెల్లుల్లిని వంటకాలలో బహు విధాలుగా వాడతారు. వెల్లుల్లిని నీరుల్లి, అల్లం, టమోటాలతో కలిపి వాడితే రుచిగా ఉండడమే కాక చాలా రోజులపాటు చెడిపోకుండా కూడా ఉంటుంది.
  • వెల్లుల్లిని పచ్చిగా కాని, ఆహార పదార్థాలతో గానీ వండుకుని, వేయించుకుని మందులాగా కానీ తీసుకోవడం అనేది సర్వసాధారణ విషయం. వెన్నలో వేయించుకుని రోజుకు ఏడు, ఎనిమిది వెల్లుల్లి పాయల్ని తింటే జీర్ణవ్యవస్థ చురుగ్గా తయారై క్రియాశీలతను పెంచుకుంటుంది. ఇందులో విటమిన్- సి, బి6, సెలీనియమ్, జింక్, కాల్షియమ్, పొటాషియమ్ వంటి లక్షణాలు ఉన్నాయి. విటమిన్-సితో అల్లిసిన్ కలిపి పని చేయడంవల్ల బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను నిరోధించడం చాలా తేలిక అవుతుంది. అంతేకాదు వెల్లుల్లి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడంవల్ల విటమిన్-సి, అల్లిసిన్‌ల పనితనం మరింతగా పెరుగుతుంది.
  • జ్వరాల నుండి త్వరగా కోలుకోవడానికి, రొంప నుండి బైట పడటానికి వెల్లుల్లిరసం, తేనెల మిశ్రమం దివ్య ఔషధంగా పని చేస్తుంది. వెల్లుల్లిలోని అవశ్య తైలాలలో గంధక శికాల ఉంటాయి. ఈ గంధకం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి యాంటీ బయాటిక్‌గా, యాంటీ వైరస్‌గా పని చేయడానికి ఈ గంధకమే కారణం.
  • ఔషధంగా వెల్లుల్లి ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇది జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. జీర్ణాశయానికి వచ్చే కేన్సర్‌ను నివారిస్తుంది. ఆస్త్మాను అరికడుతుంది. జలుబు, దగ్గును నివారిస్తుంది. దురదకు, పగుళ్ళకు, తామరకు, పుండ్ల నివారణకు వాడవచ్చు. నోటిపూతను తగ్గిస్తుంది. రక్తంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. దీర్ఘకాలిక జ్వరాలకు త్వరితంగా ఉపశమనం కలిగిస్తుంది. గర్భిణుల ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుతుంది. బాలింతలకు పాలు బాగా పడేలా చేస్తుంది. రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top