వేధించే తలనొప్పికి గుడ్ బై

చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య తలనొప్పి. ఈ సమస్యకు చాలా మంది సొంత వైద్యంనే ఆశ్రయిస్తుంటారు. ఏవో తెలిసిన మాత్రలు వేసేసుకుంటారు. దీనివల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గినా సమస్య పూర్తిగా తొలగిపోదు. తలనొప్పి రావడానికి గల కారణాలపై దృష్టి సారించరు. కొందరిలో తలనొప్పి దీర్ఘకాలంపాటు వేధిస్తూ ఉంటుంది. ఇటువంటి వారు నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. అయితే తలనొప్పికి హోమియో మందులు ద్వారా తలనొప్పికి శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.

సాధారణంగా మెదడు నొప్పికి పెద్దగా స్పందించదు. కారణం మెదుడులో నొప్పికి స్పందించే నొప్పి గ్రాహకాలు లేవు. నొప్పికి స్పందించే మెదడు చుట్టూ ఉండే భాగాలలో కలత(క్షోభము) ఏర్పడుట వలన తలనొప్పి వస్తుంది. తల, మెదడులో నొప్పి గ్రాహకాలు కల భాగాలను రెండుగా చెప్పుకోవచ్చు. క్రోనియం లేదా కపాలం లోపల కల రక్తనాళాములు, మెదడు చుట్టూ ఉండే మెనింజిస్ పొరలు, కపాల నాడులు. క్రోనియం వెలుపలి పెరియాస్టియమ్ కండరములు, నాడులు, రక్తనాళములు, సబ్‌క్యుచేనియస్ కణజాలం, కన్నులు, చెవులు, సైనస్‌లు, మ్యూకస్‌పొరలు. 

తలనొప్పి- గ్రూపులు
తలనొప్పి అనేక కారణాల చేత వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తలనొప్పిని 14 గ్రూపులుగా విభజించారు. ఇందులో మొదటి నాలుగు గ్రూపులను ప్రథమశ్రేణి తలనొప్పులుగా, 5 నుంచి 12 వరకు గ్రూపులను ద్వితీయ శ్రేణి తలనొప్పులుగా విభజించారు. చివరి రెండు గ్రూపులను ఇతర రకములుగా పేర్కొన్నారు.

ప్రథమశ్రేణి గ్రూపులు : 
మైగ్రేన్, మానసిక ఒత్తిడి వలన తలనొప్పి వస్తుంది. జీవనవిధానంపై అధిక ప్రభావం ఉంటుంది.

ద్వితీయశ్రేణి గ్రూపులు: 
తల, మెడలో అవయవ నిర్మాణంలో వచ్చే తేడాల వల్ల తలనొప్పి వస్తుంది. ముఖ్యంగా మెదడులో రక్తస్రావం, కణితులు, మెదడును చుట్టి ఉండే పొరల వాపు కారణంగా తలనొప్పి వస్తుంది.
నొప్పిస్వభావం
తలనొప్పి ఒక్కో వ్యక్తిలో ఒక్కోరకంగా ఉంటుంది. సాధారణ నొప్పి, భరించలేనంత నొప్పి, తీవ్రమైన నొప్పి, విడువకుండా, విరామంతో వచ్చే నొప్పి, అదురుతున్నట్లు, నొక్కుతున్నట్లు, పగిలిపోతున్నట్లు, పొడుస్తున్నట్లుగా అనిపించే తలనొప్పి..ఇలా వివిధ రకాలుగా ఉంటుంది.
కారణాలు
- శరీరకణజాలంకు తగినంత ఆక్సీజన్ అందకపోవడం.

- బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మ జీవులకు సంబంధించిన విషపదార్థాలు శరీరంలో అధికంగా ఉండుట.

- ముక్కు, చెవి, గొంతు, టాన్సిల్స్ భాగాలలో ఇన్ఫెక్షన్లు.

- టైఫాయిడ్, మలేరియా, ట్యుబర్‌క్యులోసిస్ ఇన్ఫెక్షన్లు.

- పిత్తాశయ రోగములు, కామెర్లు, రుమాటిజమ్, డయాబెటిస్, జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగుట.

- అధిక రక్తపోటు, గుండె కవాట సమస్యలు, రక్తంలో అధిక ఆమ్లత, అధిక క్షారత.

- మెదడులో కణితి, సిస్ట్, రక్తనాళములలో రక్తస్రావం, థ్రాంబోసిస్, ఎన్యురిజం వంటి సమస్యలు.

- మెనింజైటిస్ వంటి నాడీ సమస్యలు.

- అధిక శ్రమ లేక అధిక విశ్రాంతి వలన వచ్చే భౌతిక నిస్త్రాణ.

- మానసిక ఒత్తిడి, ఉద్రేకం, బాధ, విచారం, ఆందోళన వంటి మానసిక సమస్యలు.

- రక్తంలో గ్లూకోజ్ శాతం ఎక్కువవటం లేక తక్కువవటం.
హార్మోన్ల సమతుల్యతలో అవరోధం, ఋతుస్రావం కంటే ముందు లేక తరువాత తలనొప్పికి ఇదే కారణం.

- అధిక శబ్ధం, కాంతి, టీవీ, గాఢమైన వాసనలు, వాతావరణంలో మార్పులు.

- చాలా సందర్భాలలో తలనొప్పికి కారణం తెలియకపోవచ్చు. కారణం గుర్తించుట కూడా సాధ్యం కాకపోవచ్చు. కొందరిలో వంశపారపర్యంగా మైగ్రేన్ తలనొప్పి రావచ్చు.

చికిత్స
సాధారణ తలనొప్పి మాత్రలతో తగ్గిపోతుంది. చాలా సందర్భాలలో విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. దీర్ఘకాలిక తలనొప్పి విషయంలో మాత్రమే కొన్ని పరీక్షలు చేయించాల్సి వస్తుంది. తలనొప్పి స్వభావం, వికారం, వాంతులు, ఇతర లక్షణాలను సేకరించి కారణాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. ఆధునిక రోగ నిర్ధారణ పరీక్షలతో కూడా తలనొప్పి కారణాలను గుర్తించవచ్చు. జీవరసాయనిక రక్తపరీక్షలు, స్కల్ ఎక్స్‌రే, ఇ.ఇ.జి, సిటి స్కాన్, ఎమ్ఆర్ఐ స్కాన్ వంటి పరీక్షలు తలనొప్పికి గల కారణాలను గుర్తించడానికి ఉపయోగపడతాయి.

హోమియో చికిత్స
తలనొప్పి చికిత్స పూర్తిగా వ్యక్తి తత్వ సంబంధంగా ఉంటుంది. అందరికీ ఒకే మందు కాకుండా వ్యక్తి తత్వము ఆధారంగా మందును ఇవ్వడం జరుగుతుంది. హోమియో మందులు జన్యువులలోని అసమతుల్యతను సరిచేసి దేహరక్షణ వ్యవస్థను పరిరక్షించుటలో ఎంతగానో తోడ్పతాయి. వంశపారపర్యంగా వచ్చే మైగ్రేన్ తలనొప్పికి కూడా హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో నిర్ణీత కాలం పాటు చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top