- ఉదయాన్నే అవిసె గింజలు నానపెట్టిన ఒక గ్లాసు మంచి నీటిని తీసుకోవాలి. అవిసె గింజల్లో ఒమెగా 3 ఆమ్లాలు ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
- రోజూ ఉదయాన్నే ఒక ఉసిరి కాయ తినాలి.
- ప్రతిరోజూ రాత్రి ఐదు ఆల్మండ్ గింజలను నానపెట్టి వాటిని తెల్లవారి ఉదయాన పొట్టు తీయకుండా తినేయాలి.
- మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. ఇవి జుట్టుకి కావలసిన పోషకాలను అందిస్తాయి.
- ఒక గిన్నెడు మొలకెత్తిన గింజలు తినాలి.
- ప్రొటీన్ల కోసం ప్రతిరోజూ ఒక గుడ్డు తినాలి. కోడి కూర కూడా తినాలి.
- టీ, కాఫీలు తగ్గించాలి. పూర్తిగా మానేస్తే మంచిది.
- తలస్నానం చివర్లో ఒక టీ స్పూను నిమ్మరసంతో కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది. చుండ్రు రాదు.
- రోజుకి రెండు గ్లాసుల వెన్న తీసిన పాలు తాగితే ఎంతో లాభం ఉంటుంది.
- వారానికి ఒకసారి మెంతి గింజల గుజ్జును మాడుకు పట్టించి అరగంట తరువాత తల శుభ్రం చేసుకోవాలి. అలాగే పరగడుపున మెంతులు నానపెట్టిన నీళ్లు తాగాలి.
- స్ట్రాబెర్రీలు, అరటిపండ్లు, యాపిల్స్, మామిడి పండ్లు, సపోట, ద్రాక్షలను రోజూ రెండు లేదా మూడు పళ్లు తింటే మంచిది.
- కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పాలకూర ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది.
- చేపలు, కోడి, గుడ్లు వాడకం పెంచితే జుట్టు బాగుంటుంది. రెడ్ మీట్‌కి దూరంగా ఉండాలి.