కాలేయ(లివర్ ) వ్యాధులు -హోమియో చికిత్స

కాలేయం శరీరంలో ఒక జీవరసాయనిక కర్మాగారంగా పని చేస్తుంది. కాలేయ కణాలను హెపటాసైట్స్ అంటారు. ఇవి శక్తి సమతుల్యతను క్రమబద్ధీకరించడంతోపాటు రోగకారక క్రిములతో పోరాడటం, హానికర విషపదార్థాలను వేరుపరచడం, జీర్ణక్రియకు తోడ్పడే బైల్‌ను ఉత్పత్తి చేయడం, రక్తం గడ్డకట్టడంలో ఉపయోగపడే పదార్థాలను తయారు చేయడం వంటి విధులను నిర్వర్తిస్తాయి. అందువల్ల కాలేయం పనితీరును లేదా కాలేయ వ్యాధులను గుర్తించడానికి వివిధ రకాల పరీక్షలు చేయవలసి ఉంటుంది. దీనినే లివర్ ప్రొఫైల్ అంటారు.

లివర్ వ్యాధులు ఎందుకు వస్తాయి?
దీర్ఘకాలికంగా లేదా అధిక మోతాదులో మందులు వాడటం వలన, హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ కారణంగా, అధిక మోతాదులో ఆల్కహాల్ సేవనం వల్ల, వంశపారంపర్య కారణాల వల్ల, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం వంటి వాటి మూలంగా కాలేయ సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చు.
సిర్రోసిస్ అంటే... వ్యాధి కారణంగా నష్టపోయిన కాలేయ కణాల స్థానంలో చర్మంపై భాగంలో వలె కొత్తకణాలు ఏర్పడతాయి. ఈ కణాలు సమర్థంగా పని చేయలేకపోవడమే గాక కాలేయంలో రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తాయి. కొత్త కాలేయ కణజాలం పెరిగిన కొద్దీ కాలేయం తన విధులను సమర్థంగా నిర్వహించలేదు. ఈ స్థితిని సిర్రోసిస్ అంటారు. 


లక్షణాలు: నీరసం, నిస్ర్తాణ, జీర్ణశక్తి మందగించటం, బరువు తగ్గడం, ముక్కు నుంచి రక్తం కారడం, కాళ్లవాపు, అపస్మారక స్థితికి చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభదశలోనే గుర్తించి, సాధారణ స్థితిని పునరుద్ధరించుకోకపోతే ప్రమాదకర స్థితికి దారితీస్తుంది. ఈ పరిస్థితిలో కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్) ఒక్కటే పరిష్కార మార్గం. ఇది అత్యంత క్లిష్టమైన, ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ.
సాధారణచికిత్స: సాధారణ రుగ్మతలకు కూడా వైద్యుల సలహా లేకుండా విచ్చలవిడిగా మందులు వాడకుండా ఉండటం. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే ఆహారం తీసుకోవటం, జీవన శైలిని మార్చుకోవటం, మద్యాన్ని మానేయటం, ఆహారంలో కొవ్వు, ప్రొటీన్లు తక్కువగా ఉన్న పదార్థాలను తగ్గించటం.
హోమియో చికిత్స: రోగి మానసిక, శారీరక స్థితిగతులను బట్టి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆరంమెట్, కాల్కేరియా ఆర్స్, కార్డస్ మార్, బెలిడోనియం వంటి మందులను వాడవలసి ఉంటుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top