సన్‌ గ్లాసెస్‌తో తలనొప్పిమాయం


ప్రపంచంలో మైగ్రేన్‌తో బాధపడేవాళ్లు చాలామంది ఉన్నారు. ఒక్కసారి ఆ నొప్పి వచ్చిం దంటే చాలు.. నరాలన్నీ లాగే స్తాయి. మైండ్‌ సరిగా పనిచేయదు. మానసికస్థితి సరిగా ఉండదు. ఈ నొప్పితో బాధ పడేవారు...రిలీఫ్‌ పొందాలంటే మందులు, ఇంజక్షన్లు లేకపోతే.. బామ్‌లు రాసేవారు. అది ఒకప్పుడు. మరీ ఇప్పుడు.. జస్ట్‌ సన్‌గ్లాసస్‌ పెట్టుకుంటే చాలు. నొప్పులు హుష్‌కాకి. మైగ్రేన్‌తో బాధపడేవారి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ సన్‌గ్లాసస్‌ ఆ నొప్పిని దూరం చేస్తాయి. ఇవి పూర్తిగా మైగ్రేన్‌ని నిరోధించలేకపోయినా..నొప్పితో బాధపడేవారికి మంచి రిలీఫ్‌ని మాత్రం ఇస్తాయి.

సాధారణంగా మైగ్రేన్‌తో బాధపడేవారు ఆ తీవ్రత నుండి ఉపశమనాన్ని పొందేం దుకు డార్క్‌ రూమ్‌లోకి వెళ్తుంటారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎంచక్కా గ్లాసెస్‌ పెట్టుకుంటే చాలు. సన్‌గ్లాసస్‌ కదా..వీటిని పొద్దున్నే... అది ఎండలో ఉన్నప్పుడే పెట్టు కోవాలన్నా రూల్‌ ఏమీ లేదు. రాత్రిపూటైనా.. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ధరించవచ్చు. సాధారణంగా తలనొప్పి వస్తే....తలకే కాదు మొత్తం బ్రెయిన్‌ పట్టేసి నంత బాధగా ఉంటుంది. చాలాకాలంగా మైగ్రేయిన్‌తో బాధపడేవారి కోసం ఆ నొప్పి ని తగ్గించుటానికి శాస్తవ్రేత్తలు విపరీతమైన ప్రయత్నాలు చేస్తువచ్చారు. ఐతే ఆ మార్గాలన్నీ కూడా అంత సక్సెస్‌ కాలేదు. ఎన్నో రకా లుగా వారు ప్రయత్నిస్తున్న ప్పటికీ.. అవి విజయవం తంకాలేదు.

అయితే ఇజ్రా యిల్‌కి చెందిన డీకోనెస్‌ మెడికల్‌ సెంటర్‌కి చెందిన ఓ టీమ్‌ దీని మీద పరిశో ధనలను ప్రారంభించింది. మైగ్రేన్‌ని తగ్గించటానికి కాంతి చక్కని పరిష్కారం కాగలదని వీరు నిరూ పించారు.. కాంతి ఎలా మైగ్రేన్‌ని తగ్గిస్తుంది అనేది మొదట్లో వీరికి అర్థం కాలేదు. పరిశోధకులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన పిమ్మట..విజువల్‌ మార్గాన్ని పరి ష్కారంగా చూపారు. గుడ్డివారిలోనూ..చూపు సరిగ్గా లేనివారిలోనూ..సాధారణ ఐసె ైట్‌ ఉన్నవారిలోనూ ఈ మైగ్రేయిన్‌ని తగ్గించే లక్షణాలు వీరు గుర్తించారు. ఈ నొప్పి వస్తే మెదడు, నాడీ కండరాల వ్యవస్థపై ఎక్కువ ప్రభావం ఉంటుంది.  



పరిశోధనలు...
సన్‌గ్లాసస్‌ని పెట్టుకోవటం వల్ల ఈ నొప్పి తగ్గిందని నిరూపించారు. ఈ గ్లాసెస్‌లో లై ట్‌ డిమ్‌గా ఉండే వాటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని.. దీని వల్ల నొప్పి తగ్గే అవకాశం మిగతా వాటి కన్నా ఎక్కువగా ఉంటుందని... నేచర్‌ న్యూరో సైన్స్‌, సీని యర్‌ అథర్‌ డాక్టర్‌ రామీ బస్టెన్‌‌‌తో పాటు మరికొంతమంది తెలిపారు. పరిశోధకులు రెండు గ్రూప్‌ల మీద ఈ పరిశోధనను చేశారు. అందులో మైగ్రేయిన్‌తో బాధప డుతున్న వాళ్లు.. కంటి బాధలతో బాధపడుతున్నవాళ్లు..

రెటినల్‌ క్యాన్సర్‌, గ్లకోమా తో ఉన్నవాళ్లు అందరినీ ఒక గ్రూపులోకి చేర్చారు. రెండో గ్రూపులో ఉన్న వారు రెటీనా వల్ల గుడ్డివారైన వారు. వీరిద్దరి మీద పరిశోధన చేసిన తరవాత.. మొదటి గ్రూపులో ఉన్నవారి కంటే రెండవ గ్రూపులో ఉన్నవారే దీని వల్ల ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని పరిశోధకుల్లో ఒకరైన బస్టెన్‌ తెలిపారు. దీంతో ఇక సన్‌గ్లాసెస్‌ చల్లదనానికి, ఫ్యాషన్‌కే కాదు.. తలనొప్పులతో బాధ పడేవారికి ఉపశమనంగానూ ఉంటాయి. ఈ సన్‌ గ్లాసెస్‌ను అమెరికా, యూరప్‌లలో ముందుగా ప్రవేశ పెట్టారు. వీటిని ధరించి మైగ్రేన్‌ బాధితులు ఉపశమనం పొందుతున్నారు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top