షాంపూలు, కండిషనర్లు - వాటి ఎంపిక - వాడటంలో జాగ్రత్తలు

నిగనిగలాడుతూ, గాలికి ఆరోగ్యంగా ఎగురుతూ ఉండే జుట్టు అంటే ఇష్టపడని వారుండరు. ఈ బిజీ లైఫ్‌లో కుంకుడుకాయతో తలస్నానం చేసే అవకాశం లేక చాలామంది షాంపూలను వాడుతుంటారు. ఎలాంటి షాంపూ ఎంచుకోవాలనే విషయం మీద చాలామందిలో గందరగోళం ఉంటుంది. టీవీలో వచ్చే రకరకాల షాంపూలు, కండిషనర్లు వాడితే జుట్టులో పడినట్లే చిక్కులు ఎదురుకావచ్చు. అన్ని షాంపూలు మంచి చేయకపోవచ్చు. కాబట్టి వాటి ఎంపికలో, వాడటంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.

కేవలం జుట్టును, తలను శుభ్రం చేసే ప్రతిదీ మంచి షాంపూ అనుకుంటే పొరపాటు. అపాయకరం కానిదే మంచి షాంపూ. దాంతో తలంటుకున్న తరవాత జుట్టును దువ్వెనతో తేలికగా దువ్వుకోగలగాలి. జుట్టు అడ్డదిడ్డంగా ఎగిరిపోకుండా, చూడటానికి అందంగా ఉండాలి. రుద్దుకున్న తరవాత, తలంతా తేలికయినట్టుగా, మనసుకు హాయిగా అనిపించాలి. తలకి ఉన్న జిడ్డు, మట్టి, మృతచర్మం, దుమ్ము, ధూళి వంటివాటిని పోగొట్టాలి. ఇవన్నీ ఉంటే అది మంచి షాంపూ.

ఆమ్లగుణమో లేదా క్షారగుణమో...
క్షారగుణం ఎక్కువగా ఉండే షాంపూల వల్ల జుట్టు బాగా గరుకుగా అయ్యి, జీవాన్ని కోల్పోతుంది. అంతేకాక జుట్టు చివర్లు చిట్లిపోవచ్చు. చిక్కులు పడవచ్చు. పర్యవసానంగా జుట్టు ఊడిపోతూంటుంది. చాలావరకు షాంపూలు కొద్దిగా ఆమ్లగుణంతో ఉండి, క్యూటికిల్‌ని మృదువుగా ఉంచి, జుట్టును మృదువుగా చేస్తాయి. అందువల్ల ఆమ్ల, క్షార గుణాలు సమంగా ఉండే (పీహచ్ బ్యాలెన్స్) షాంపూలు ఉండవు.
  

ఎంత తరచుగా వాడాలి...
వారానికి ఎన్నిసార్లు తల స్నానం చేయాలన్నది నార్మల్, డ్రై, ఆయిలీ స్కిన్ వంటి అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. తలకి ఎంత జిడ్డు ఉంటుంది, ఎన్ని పనులలో తలమునకలై ఉన్నారు, వాతావరణంలోని తేమశాతం... వంటివి. అనవసరంగా మాటిమాటికీ తలస్నానం చేయడం వల్ల జుట్టు సహజత్వాన్ని కోల్పోయి, త్వరగా చిట్లిపోతుంది. అదేవిధంగా అవసరమైనన్నిసార్లు తలస్నానం చేయకపోతే కూడా జుట్టంతా జిడ్డు పట్టి, సహజత్వాన్ని కోల్పోయి, చిక్కులు పడిపోతుంది. పర్యవసానంగా చుండ్రు సమస్య ప్రారంభమవుతుంది.

మంచి నియమాలు
షాంపూ వాడితే జుట్టు కుప్పలా ఒక్కచోటికి రాకూడదు.

కండిషనర్స్ తరచూ వాడుతూండాలి. ఇవి జుట్టును... ఎండిపోయి, పీచులా తయారవ్వకుండా కాపాడతాయి.

జుట్టును కింద నుంచి దువ్వుకుంటూ రావాలి. ముందరే కుదుళ్ల దగ్గర దువ్వడం మొదలుపెడితే జుట్టంతా ఒకచోటుకి వచ్చి చిక్కుపడిపోతుంది.

కండిషనర్లను ఎక్కువగా ఉపయోగిస్తే జుట్టు చూడటానికి మెరుస్తూన్నప్పటికీ, సమంగా దువ్వుకోవడం కుదరదు. చుండ్రు పెరిగే అవకాశం కూడా ఉంది.

షాంపూలు, కండిషనర్ల గురించిన అవగాహన ఏర్పడితే ఎటువంటి వాటిని ఎంచుకోవాలో తెలుస్తుంది. తద్వారా జుట్టును సంరక్షించుకోవడం సాధ్యమవుతుంది.

షాంపూలో ఏమేమి ఉంటాయంటే...
షాంపూలలో ముఖ్యంగా సర్ఫ్‌యాక్టెంట్, కో- సర్ఫ్‌యాక్టెంట్, ఉప్పు, సుగంధాన్నిచ్చే వస్తువులు, వీటితోపాటుగా ప్రిజర్వేటివ్‌లను వాడతారు. సర్ఫ్‌యాక్టెంట్‌లలో సోడియమ్ లారిల్ సల్ఫేట్, సోడియమ్ లారేట్ సల్ఫేట్, అమోనియమ్ లారిల్ సల్ఫేట్, అమోనియమ్ లారేట్ సల్ఫేట్ వంటివి ఉంటాయి. సర్ఫ్‌యాక్టెంట్లు జుట్టు మీది మురికిని పోగొట్టి, నురగ వచ్చేలా చేసి, తలను శుభ్రం చేస్తాయి. కో-సర్ఫ్‌యాక్టెంట్‌లు... షాంపూ చిక్కని ద్రవంలా తయారవ్వడానికి ఉపయోగపడతాయి. సోడియం క్లోరైడ్ వంటివి షాంపూలోని చిక్కదనం అంతటా సమంగా ఉండేలా చేస్తాయి. గ్లైకోల్ స్టిరేట్ వంటి వ్యాక్స్‌లు... షాంపూలను ముత్యం రంగులో మిలమిలలాడేలా (పర్ల్ లుక్) చేస్తాయి. వీటిలో ఇంకా ఇతర విటమిన్లు, ప్రోటీన్లను కలుపుతారు. షాంపూ తయారీలో... విటమిన్ ఇ లేదా టోకోఫెరోల్ వంటివాటిని సాధారణంగా వాడుతూండటం చూస్తాం.

కండిషనర్లలో రకాలు...
కండిషనర్లలో రిన్స్, లీవ్ ఆన్, డీప్... అని మూడు రకాలు ఉంటాయి. రిన్స్ కండిషనర్లను జుట్టు మీద అప్లై చేయగానే తేలిగ్గా పరుచుకున్నట్టు అవుతాయి. ఇవి కర్లీ జుట్టు వారికి మంచిది. షాంపూతో తల రుద్దుకుని, తలను తువ్వాలుతో తుడుచుకున్న తరవాత లీవ్ ఆన్ కండిషనర్లను ఉపయోగిస్తారు. అంతేకాని తల స్నానం పూర్తికాగానే ఉపయోగించరు. ఇవి జుట్టును, తలను మృదువుగా చేసి, జుట్టుకి కొత్త మెరుపును, అందాన్ని ఇస్తాయి. జుట్టులోని గరుకుతనం పోయి, వదులుగా అందంగా తయారవుతుంది. అయితే వీటిని సరిగా వాడకపోతే కనక చుండ్రు సమస్య ప్రారంభం అవుతుంది. డీప్ కండిషనర్లు... జుట్టును క్రీమీగా, వదులుగా చేస్తాయి. వాటిని కొన్ని సమయాలలో మాత్రమే వాడాలి. వాడిన వెంటనే షాంపూతో తల రుద్దుకోవాలి. వీటిలో గ్లిజరిన్, హైడ్రోలైజ్‌డ్ ప్రొటీన్స్ వంటి మాయిశ్చైరె జర్లు ఉంటాయి. జుట్టు బాగా ఎండినట్టుగా, చిట్లిపోయినట్టుగా ఉన్నప్పుడు ఇవి ఉపయోగపడతాయి. 


కండిషనర్లు ఎలా వాడాలి?
షాంపూతో తల రుద్ది, తువ్వాలుతో తుడుచుకున్న తరవాత కండిషనర్లను ఉపయోగించాలి. వీటిని తల మీద అప్లై చేసేటప్పుడు వెంట్రుక కుదురు దగ్గర నుంచి, కింది వరకు జుట్టుకు పట్టేలా జాగ్రత్తపడాలి. అప్లై చేసిన కొన్ని నిముషాల తరవాత జుట్టును నీటితో శుభ్రపరుచుకోవాలి.

కండిషనర్స్‌లో ఏమేముంటాయి...
షాంపూతో తల రుద్దుకున్న తరవాత జుట్టు పీచులా ఎగిరిపోకుండా, అణచి ఉంచడానికి ఉపయోగించేవాటిని కండిషనర్లు అంటారు. అంటే జుట్టును మంచి కండిషన్‌లో ఉంచేవన్నమాట. ఇవి జుట్టును మెరిసేలా, మృదువుగా, చేతికి లొంగేలా ఉంచుతాయి. అదేవిధంగా క్యూటికిల్‌ను మృదువుగా, జారిపోయేలా చేస్తాయి. ఇవి బయటి క్యూటికిల్ మీద ఒక కోటింగ్‌లా ఏర్పడి, వాతావరణంలో కలిగే మార్పుల నుంచి, ఇతరత్రా ఇబ్బందుల నుంచి రక్షిస్తాయి. జుట్టు చిట్లిపోకుండా, చిక్కులు పడకుండా కాపాడుతూ... కొత్త మెరుపును, అందాన్ని తీసుకువస్తాయి.

సర్వసాధారణంగా కండిషనర్లలో సిటైల్ ఆల్కహాల్, సెట్రిమోనియమ్ బ్రోమైడ్‌లను ఉపయోగిస్తారు. కండిషనర్లను జుట్టు మీద అప్లై చేసినప్పుడు ఈ సిైటె ల్ ఆల్కహాల్ జుట్టు మీద ఒక పొరలా ఏర్పడి జుట్టుకు అందాన్నిస్తుంది. దానివల్ల జుట్టు తడిగా ఉండగానే తేలికగా దువ్వుకోగలుగుతాం. సెట్రిమోనియమ్ బ్రోమైడ్ లేదా క్లోరైడ్... యాంటీ స్టాటిక్‌గా ఉండి, జుట్టు మెరుపును మెరుగుపరుస్తుంది. అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉంటాయి. షాంపూ వాడకం ద్వారా తలకు పెట్టిన నూనె పోయి, ఆ నూనెకు బదులుగా ఇవి సహజమైన నూనె (సీబమ్) గా ఉపయోగపడతాయి. ఎసిడిఫయర్స్... గ్రీజు వంటి పదార్థాన్ని తొలగించి, జుట్టును మృదువుగా ఉండే లా చేస్తాయి. జుట్టు మీద కాంతి పడగానే మెరుస్తుంది. సిట్రిక్ యాసిడ్ అనేది అసిడిఫయర్. దీనిని కండిషనర్లలో అప్పుడప్పుడు ఉపయోగిస్తారు. రికన్‌స్ట్రక్టర్స్‌లో సాధారణంగా హైడ్రోలైజ్‌డ్ ప్రొటీన్ ఉంటుంది. ఇది కండిషనర్‌ని జుట్టులోనికి చొచ్చుకునిపోయేలా చేసి, జుట్టును గట్టిపరుస్తుంది. కండిషనర్లలో సాధారణంగా కెటియోనిక్ సర్ఫ్‌యాక్టెంట్‌లు ఉంటాయి. ఇవి జుట్టును పూర్తిస్థాయిలో శుభ్రపరచలేవు. కేవలం జుట్టుకు కావలసిన ప్రొటీన్లను మాత్రమే అందచేస్తాయి. పాంథెనాల్ వంటి మాయిశ్చరైజర్లు క్యూటికిల్‌ను తేమగా ఉంచుతాయి. అందువల్ల జుట్టు నిలబడిపోకుండా వదులుగా గాలిలో తేలుతున్నట్టుగా ఉంటుంది. సెటిల్ ఆల్కహాల్, ఒలెయిల్‌ఆల్కహాల్, స్టెర్లీ ఆల్కహాల్ వంటి లాంగ్ చెయిన్ ఫ్యాటీ ఆల్కహాల్స్ జుట్టుకు లూబ్రికెంట్లగా పనిచేస్తాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top