వేసవిలో ముఖారవిందానికి.....జాగ్రత్తలు

అసలే వేసవి కాలం. ఎండలు మండిపోతున్నాయి. ఎండలకు తోడు వాహనాల కాలుష్యం. గంట బయటకు వెళితే చాలు ముఖం నల్లగా మారిపోతోంది అంటూ చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఈ వేసవికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ముఖారవిందాన్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
  • ఎండలో వెళ్లాల్సి వచ్చినపుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి. గొడుగు పట్టుకెళితే మరీ మంచిది.
  •   నీరు ఎక్కువగా తాగండి. ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది. కొబ్బరి నీరు తీసుకుంటే ఇంకా మేలు.
  •   సమయానికి భోజనం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. రోజూ రెండు రకాల పండ్లను తినండి. ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వండి.
  •  అలసిన చర్మానికి తిరిగి జవసత్వాలు రావాలంటే మంచి నిద్ర తప్పనిసరి. కంటి నిండా నిద్రపోతే చర్మం తాజాదనం సంతరించుకుంటుంది.
  •   దుమ్ము, కాలుష్యంకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతున్నట్లయితే రోజూ క్లీన్సర్లు ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేసుకోండి.
  • రాత్రి పడుకునే ముందు మాయిశ్చర్ రాసుకోండి.
  •   వ్యాయామం మీ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. కాబట్టి క్రమంతప్పకుండా వ్యాయామం చేయండి. ఒంటికి చెమట వచ్చేలా జాగింగ్‌లాంటివి చేస్తే ఇంకా మంచిది.
  •   యోగా, ప్రాణాయామం చేయండి. ఇవి ఒత్తిడిని దూరం చేసి మానసిక ప్రశాంతతను అందిస్తాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top