కార్న్‌ఫ్లోర్ కేక్

From paneer
కావలసిన పదార్థాలు
కార్న్‌ఫ్లోర్ - ఒక కప్పు, పాలు - మూడు కప్పులు, పంచదార - ఒక కప్పు, జీడిపప్పు - ఒక టేబుల్ స్పూన్, బాదం పప్పు - ఒక టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు -చిటికెడు, నెయ్యి - తగినంత, కలర్ - కొంచెం.

తయారుచేయు విధానం
ముందుగా కార్న్‌ఫ్లోర్‌లో పాలు, పంచదార, కలర్ వేసి ఉండలు లేకుండా కలిపి పదినిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత జీడిపప్పు, బాదం పప్పును మెత్తగా నూరి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో పాలు కలిపిన కార్న్‌ఫ్లోర్ మిశ్రమం తీసుకుని వేడి చేయాలి. జీడిపప్పు, బాదం పప్పు పేస్టు, కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి.


పాలు మరుగుతున్నప్పుడు ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత మూడు టేబుల్ స్పూన్‌ల నెయ్యి వేసి బాగా కలపాలి. తరువాత ఒక ప్లేటు తీసుకుని దానికి నెయ్యి రాసి మిశ్రమంను అందులో పోయాలి. చల్లారిన తరువాత నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. అంతే..కార్న్‌ఫ్లోర్ కేక్ రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top