వేసవి... వచ్చింది పారాహుషార్! - ఆయుర్వేదపరమైన పరిష్కారాలు

ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. విపరీతం అవుతున్న వేడి ప్రభావం మన శరీరం మీద పడి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఒళ్లు మంటలు, కళ్ల మంటలు, మూత్రవిసర్జనలో మంట, జీర్ణపరమైన సమస్యలు ఈ కాలంలో అధికం. చెమట ద్వారా ఎక్కువ నీరు శరీరం నుంచి బయటకు పోవడం వల్ల నీరసం, నిస్త్రాణ, కాళ్లతీపులు, తలనొప్పి, తలతిరగడం, శరీరం ఎప్పుడూ వేడిగా ఉండడం, తరచూ జ్వరం రావడం వంటి సమస్యలు ఈ కాలంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్యలకు ఆయుర్వేదపరమైన పరిష్కారాలు చూద్దాం.

  •  నీళ్లు తరచుగా తాగాలి. కొబ్బరినీళ్లు, చెరుకురసం, పళ్లు, పళ్లరసాలు అధికంగా తీసుకోవాలి. ద్రవాహారాలు అధికంగా సేవించాలి.
  • ఉదయం, సాయంత్రం గులాబీ రేకులతో తయారయ్యే రుచికరమైన గుల్కండను ఒక స్పూన్ వంగులన సేవించాలి.
  • చర్మంపై చెమటకాయలు, దురదలు, మంటలు వేధిస్తుంటే రోజ్ వాటర్‌లో తగినంత శ్రీగంధం పొడిని కలిపి పట్టించాలి.
  • శిలాజిత్ క్యాప్సుల్స్ లేదా చందనాది మంటి మాత్రలు ఉదయం, సాయంత్రం ఒకటి చొప్పున తీసుకోవాలి.
  • సుగంధపాల మొక్కలతో తయారయ్యే శారిబాద్యారిష్ఠ లేదా వట్టివేళ్లతో తయారయ్యే ఉశీరాసవ సిర ప్‌ను రెండు స్పూన్ల మోతాదులో సమంగా నీరు కలిపి, రోజూ రెండు సార్లు తీసుకుంటే మేలు.
  •  విత్తనాల్ని తొలగించిన ఎండు ఖర్జూరాలు, ఐదారు కిస్‌మిస్‌లను ఒక కప్పు నీటిలో వేసి, రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే సేవించినా శరీరంలో అధిక వేడి తగ్గుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top