మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారం గురించి తెలుసుకోండి.


సంపూర్ణ ఆరోగ్యానికి సింపుల్ సూత్రం సమతులాహారం. మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారం గురించి తెలుసుకోండి.
కెరొటినాయిడ్స్
పసుపు, ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో కెరొటినాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ప్రతి ఒక్కరూ కెరొటినాయిడ్స్ ఉండే పదార్థాలను ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. మహిళలు వీటిని తీసుకుంటే రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అవకాశాలు తగ్గుతాయి.

చేపలు
వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు డిప్రెషన్ నుంచి గుండెజబ్బుల దాకా అన్నింటినీ నివారించగలవు. మహిళల్లో హార్మోన్ల ప్రభావం వల్ల మూడ్‌స్వింగ్స్ ఎక్కువ. కాబట్టి ఇవి వాళ్లకి మంచి మందు.

టొమాటో 
వీటిలోని లైకోపీన్ రొమ్ముక్యాన్సర్‌ను నివారిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండెజబ్బుల రిస్కూ తగ్గుతుంది.

తోటకూర

దీనిలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీనిలోని మెగ్నీషియం ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) సమస్యను తగ్గిస్తుంది.

పాలు
కాల్షియంకి మారుపేరు పాలు. పాలలో విటిమిన్ డి కూడా ఎక్కువగానే ఉంటుంది. మహిళల్లో సర్వసాధారణంగా కనిపించే ఆస్టియో ఆర్థరైటిస్ అవకాశాన్ని తగ్గించడంలో పాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. పిఎంఎస్ సమస్య కూడా తగ్గుతుంది.

ఓట్స్
బిపి నుంచి మధుమేహం దాకా మంచి మందులా పనిచేసే ఓట్స్ గర్భిణి స్త్రీలకు మరింత మేలు చేస్తాయి. గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల పుట్టే శిశువుకు జన్యులోపాలు కలిగే అవకాశం చాలా తక్కువ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top