ఆరు నుంచి ఇరవై ఏళ్ల వరకు చేసే(ఎదిగే వయసుకు) యోగాసనాలు

ఆరు నుంచి ఇరవై ఏళ్ల వరకు చేసే(ఎదిగే వయసుకు) యోగాసనాలు
పొడవుగా నాజూగ్గా ఉండే వారిలో ఆత్మవిశ్వాసం అధికం. ఎదిగే వయసులో అంటే ఆరు నుంచి మొదలుపెట్టి ఇరవై ఏళ్ల వరకు కొన్ని యోగాసనాలు ప్రయత్నించడం వల్ల చక్కని ఎత్తును పొంద వచ్చు. 



రెం
డు కాళ్లు దగ్గరగా పెట్టుకుని నిలబడి రెండు చేతులూ పైకి పెట్టి చేతి వేళ్లను కలిపి ఉంచి అరిచేతులు పైకి వచ్చేట్టుగా పెట్టాలి. గాలి తీసుకొంటూ మెల్లగా కాలి వేళ్లమీద పైకి లేచి... అలానే శరీరాన్ని నిలపగలగాలి. గాలి వదిలేస్తూ నెమ్మదిగా కింద పెట్టాలి. ఇలా పదిసార్లు చెయ్యాలి. దీనివల్ల శరీరంలోని కండరాలు, ఎముకలు బాగా సాగుతాయి. పొడవు పెరగడానికి సహకరిస్తుందీ ఆసనం.  

యోగిక్‌ శ్వాస 


సిద్ధాసనంలో కూర్చుని రెండు చేతులు చిత్రంలో చూపినట్టుగా చిన్‌ముద్రలో ఉంచాలి. దీర్ఘంగా శ్వాస తీసుకొని గాలిని మెల్లగా వదిలేయాలి. ఇలా మూడు నుంచి ఐదు నిమిషాల పాటు రోజూ చెయ్యాలి. వీటితో పాటు ఎత్తు పెరగడానికి సూర్యనమస్కారాలు చెయ్యాలి. రోజులో పన్నెండు సూర్య నమస్కారాలు చెయ్యాలి. పాతికేళ్లలోపు వారు సైతం వీటిని సాధన చెయొచ్చు.

వీరభద్రాసనం  


కాళ్లు దూరంగా పెట్టి కుడిపాదం కుడివైపునకి తిప్పి పెట్టి ఎడమకాలిని అలానే ఉంచాలి. కుడి మోకాలు వంచినప్పుడు ఆ కాలివేళ్లు మరీ ముందుకు రాకుండా జాగ్రత్త పడాలి. తర్వాత మెల్లగా కుడివైపునకు తిరిగి కుడిచేతిని కుడికాలి పాదం పక్కనే ఆనించి ఎడమ చేతిని తలమీదుగా రానిచ్చి చెవి పక్కగా నిదానంగా ఉంచాలి. అయితే తల కూడా నిదానంగా చూస్తూ ఉన్నట్టుగా ఉంచాలి. ఈ ఆసనంలో శరీర బరువు రెండు కాళ్ల మీదా ఉంచాలి. ఏదో ఒక కాలిపైనే ఉంచకూడదు. ఈ ఆసనం చేసేటప్పుడు రెండు కాళ్లు దూరంగా శరీరానికి అనుగుణంగా బ్యాలన్స్‌ చేసుకోవాలి. ఈ ఆసనంలో పది నుంచి ముప్ఫై సెకన్ల వరకు ఉండాలి. తర్వాత నెమ్మదిగా ఉపశమనం పొందాలి. యథాస్థానానికి చేరుకోవాలి. తిరిగి అదే విధంగా
ఎడమ వైపూ చెయ్యాలి.

మత్స్యాసనం 


కుడి కాలిని ఎడమతొడ మీద .. ఎడమకాలిని కుడి తొడ మీద ఉంచి పద్మాసనంలో కూర్చోవాలి. ఆపై మెల్లగా వెనక్కి మోచేతులు ఆనించుకొంటూ కింద పెట్టాలి. వెనక్కి తలకింద పెట్టాలి. రెండు అరిచేతులు రెండు చెవులు పక్కనపెట్టి తలని పూర్తిగా స్ట్రెచ్‌ చెయ్యాలి. రెండు చేతులతో రెండు కాలి బొటనవేళ్లని పట్టుకొని నిదానంగా ఉంచాలి. ఆ ఆసనంలో మీరు ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత తిరిగి మెల్లగా రెండు చేతులతో తలని తీసుకొని రెండు మోచేతుల మీద బరువు వేస్తూ మెల్లగా యథాస్థానానికి రావాలి. అప్పుడు కాళ్లని రిలాక్స్‌ చెయ్యాలి.

పాదహస్తాసనం 


ముందుగా నిటారుగా నిలబడి రెండు పాదాలను దగ్గరకు ఉంచి రెండు చేతులని పైకి నిటారుగా పెట్టి గాలి వదిలేస్తూ మెల్లగా ముందుకు వంగాలి. రెండు చేతుల రెండు కాళ్లను పెట్టుకొని గాలిని తీసుకొంటూ మెల్లగా పైకి రావాలి. ఇలా పదిసార్లు చెయ్యాలి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top