ప్రయాణంలో వాంతుల నివారణకు హోమియో చికిత్స

కొందరికి ప్రయాణాలంటే అసలు పడవు. బస్సెక్కితే చాలు వాంతులు చేస్తూ ఉంటారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక ప్రయాణాలు కూడా మానుకుంటుంటారు. అయితే దీనికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. బస్సులో, కార్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందికి వాంతులు, వికారం, తలతిరగడం వంటి లక్షణాలు కలుగుతాయి. దీనిని మోషన్ సిక్‌నెస్ అంటారు. కొందరికి షిప్‌లలో ప్రయాణించేటప్పుడు కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి.

కారణాలు
చలనంలో ఉన్న విషయం మెదడు ద్వారా మనకు వివిధ మార్గాలలో తెలుస్తుంది. ఈ సంకేతాలు కంటి ద్వారా, చెవి లోపలిభాగం ద్వారా, శరీరంలోని లోపలి కణజాలాల ద్వారా మెదడుకు చేరుతుంటాయి. నడిచేటప్పుడు ఈ మూడు మార్గాలు మెదడు ఆధీనంలో ఉంటాయి. బస్సులో గానీ, కారులో గానీ ప్రయాణిస్తున్నప్పుడు మెదడు ఈ మూడు మార్గాలను ఆధీనంలో ఉంచదు. ఉదాహరణకి కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు ప్రయాణం చేస్తున్న దృశ్యం ఏదైనా వచ్చినపుడు నాడీవ్యవస్థలో ఉండే మన కంటి మార్గం ద్వారా అది చలనం అని తెలియజేస్తుంది. కానీ చెవి లోపలి భాగం మాత్రం ఇది చలనం కాదని మెదడుకు తెలియజేస్తుంది. ఇలాంటి సందర్భంలో చలనం లేకపోయినప్పటికీ కొంతమంది మోషన్ సిక్‌నెస్‌కు గురవుతారు.

చికిత్స
మోషన్ సిక్‌నెస్‌కు యాంటీ హిస్టామిన్ మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. మెక్లైజైన్ యాంటీ హిస్టామిన్(బొనైన్, ఆంటివర్ట్, డ్రామమైన్) వంటి మందులు వాడటంద్వారా మోషన్ సిక్‌నెస్ రాకుండా నివారించుకోవచ్చు. చెవి వెనకభాగంలో స్కిన్‌పాచ్‌ని ఆప్లై చేయడం ద్వారా కూడా నివారించవచ్చు. కనీసం నాలుగు గంటల వరకు స్కిన్‌పాచ్‌ని ఉంచుకుంటే మందు చర్మం ద్వారా గ్రహించబడుతుంది. ఈ మందులు ప్రయాణానికి ముందు వాడటం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది.

హోమియో మందులు
కాక్యులస్ :
తలతిరగడం, వికారం, వాంతులు, తలనొప్పి, మెడనొప్పి, కళ్లలో నొప్పి, ఆందోళన, సమయం నెమ్మదిగా గడుస్తున్నట్లు అనిపించడం, చల్లని నీటిని ఇష్టపడుతుండటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు ఉపయోగించవచ్చు.
ఇపెకాక్ :
ప్రయాణంలో ఉండే వస్తువులను చూసినపుడు వికారం, వాంతులు, తలనొప్పి, తలతిరగడం వంటి లక్షణాలు కలుగుతాయి. కంటినొప్పి, చిరాకు, దాహం తక్కువ, నోరు తడిగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నవారు వాడదగిన మందు.
బెల్లడోనా : 
విమానాలలో ప్రయాణించే వారు వాడదగిన మందు. ఎయిర్‌సిక్‌నెస్, వికారం , వాంతులు, తలనొప్పి, తలతిరగడం, ఆందోళన, భయం, పెద్ద పెద్ద శబ్దాలను వినలేకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ మందు ఉపయోగించవచ్చు.
ఐరిస్‌వర్స్ :
ప్రయాణంలో ఉన్నప్పుడు, వస్తువులను చూసినపుడు తలనొప్పితో పాటు వికారం, వాంతులు, కళ్లు మసకగా కనిపించడం, చెవిలో రణగొణ ధ్వని విన్పించడం, తలతిరగడం, ఆకలి తక్కువగా ఉండటం వంటి లక్షణాలున్నట్లయితే సూచించదగిన మందు ఇది.
కోనియం : 
తలతిరగడం, పడకున్నా తలతిరగడం, తలనొప్పి, వికారం, వాంతులు, తిన్న తరువాత సమస్య ఎక్కువ కావడం, కళ్లు మసకగా కనిపించడం, చెవులు సరిగ్గా వినిపించకపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన ఔషధం.
బ్రయోనియ : 
కొంచెం కదిలినా సమస్య ఎక్కువ కావడం, దాహం ఎక్కువగా ఉండటం, మలబద్దకం, చిరాకు, ఆందోళన, వికారం , వాంతులు, మత్తుగా అనిపించడం, తిన్న తరువాత కడుపు సెన్సిటివ్‌గా అనిపించడం వంటి లక్షణాలు కనిపించినట్లయితే ఈ మందు వాడవచ్చు.
పెట్రోలియా : 
తలనొప్పి, తలతిరగడం, సముద్రంలో ప్రయాణించేటప్పుడు వికారం , వాంతులు కావడం, కారులో ప్రయాణించేటప్పుడు ఇవే లక్షణాలు కనిపించడం, తల బరువుగా, మొద్దుబారినట్లు ఉండటం, చిరాకు, చలికాలంలో సమస్య అధికం కావడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే ఈ మందు ఉపయోగించవచ్చు.
ప్లాటిన :
తలనొప్పి భరించలేనంతగా రావడం, తలపట్టేసినట్లు ఉండటం, మొద్దుబారినట్లుండటం, వస్తువులు ఉన్నదానికంటే చిన్నగా కనిపించడం, చెవిలో రణగొణ ధ్వని విన్పించడం, వికారం, వాంతులు,ఆందోళన, చెవి మొద్దు బారినట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు వాడవచ్చు. ముఖ్యంగా స్త్రీలకు ఇవ్వదగిన ఔషధం.
ఆర్నికా :
శరీరమంతా నొప్పులు, తల, మెదడు పట్టేసినట్లు ఉండటం, కండరాలలో నొప్పి, రుమాటిజమ్, సున్నితస్వభావం, పడుకున్న సమస్యలు తక్కువ కావడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ ఔషధం వాడవచ్చు. 

నివారణ
కారులో కూర్చున్నప్పుడు ముందు సీటులో కూర్చోవాలి. దూరంగా ఉండే ప్రదేశాలను చూస్తూ ఉండాలి. ప్రయాణంలో ఉన్నప్పుడు వెనకసీట్లలో కూర్చోవడం, చదవడం చేయకూడదు. ఘాటుగా ఉండే వాసనలు, మసాలా పదార్థాలను, నూనె పదార్థాలను ప్రయాణానికి ముందు తీసుకోకూడదు. ప్రయాణం చేయాల్సి వస్తే వైద్యులు సూచించిన మందులు వాడాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top