ఆలూ పనీర్‌ కార్న్‌రోల్స్‌


కావల్సినవి: 
 లేత మొక్కజొన్న గింజలు- రెండు కప్పులు, బంగాళాదుంపలు- పావుకేజీ, పనీర్‌- యాభైగ్రాములు, పచ్చిమిర్చి- ఐదు, అల్లం ముక్క- చిన్నది, మిరియాలపొడి- చెంచా, కరివేపాకు- నాలుగు రెమ్మలు, బ్రెడ్‌పొడి- కప్పు (వేయించాలి), ఉప్పు, పసుపు - తగినంత, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ:
ముందుగా మొక్కజొన్న గింజలు, బంగాళాదుంపలను విడివిడిగా ఉడికించుకొని చల్లారనివ్వాలి. పనీరు సన్నగా తురుముకొని పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బిపెట్టుకోవాలి. ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, మొక్కజొన్నగింజల్ని మెత్తగా ముద్దలా చేసుకొని అందులోనే ఉప్పు, పసుపు, మిరియాలపొడి వేసి బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను తీసుకొని అరచేతిలో వడల్లా అద్ది అందులో పనీరు ముద్దను పెట్టి రోల్‌లాగా చుట్టుకోవాలి. ఇలా అన్నీ తయారయ్యాక కాగుతున్న నూనెలో వేయించుకోవాలి. చివరగా బ్రెడ్‌పొడిలో దొర్లించి చల్లారనివ్వాలి. అంతే ఆలూ పనీర్‌ కార్న్‌ రోల్స్‌ తయారయినట్టే. సాస్‌తో వడ్డించండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top