ఘనమైన ప్రకృతి అందం... గణపతిపూలే

సముద్ర తీరానికి ప్రత్యేక అం దాన్నిచ్చే పర్వతాలతో కూడిన ప్రకృతి రమణీయ ప్రాంతం మహారాష్ట్ర లోని గణపతిపూలే. సముద్ర అలలు పర్వత పాదాలను తాకే అపురూప దృశ్యాలు ఇక్కడ కొత్త అందాలను సృష్టిస్తాయి. అలల తాకిడి వల్ల ఇక్కడి సముద్ర తీరాలు పసిడి, ధవళ కాంతులీనుతాయి.గణపతిపూలేలో స్వయంభు గణపతి దేవాలయం ఉంది. గౌరీ నందనుడైన గణపతి పేరునే ఈ ఊరికి గణపతిపూలే అని పేరు వచ్చింది. దేశంలోని అష్ట గణపతుల దేవాలయాల్లో గణపతిపూలే ఒకటి. గణపతిపూలేను పశ్చిమ ద్వార దేవతగా పిలుస్తారు.గణపతిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులు ఆయన వెలసిన కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తారు. గణపతిపూలే ప్రకృతి అందాలతో శోభిల్లుతుంది. పచ్చ దనంతో కూడిన అడవులు ఇక్కడ ఉన్నాయి. గణపతిపూలేలో మామిడి, వక్క, అరటి, కొబ్బరి వంటి వనాలు ఉన్నాయి. పశ్చిమ తీరం వెంట ఇటువంటి వనా లు ఎక్కువగా ఉంటాయి.
ఇతర దర్శనీయ ప్రాంతాలు...
మాల్గుండ్‌:

 మరాఠీ కవి కేశవ్‌ సూత్‌ జన్మించిన ప్రాంతం ఇది. సూత్‌ సేవలను గుర్తించుకునే విధంగా కేశవ్‌ సూత్‌ స్మారక్‌ అనే మందిరాన్ని నిర్మించారు.

పావస్‌: 

ప్రకృతి రమణీయతకు నెలవైన ప్రాంతం పావస్‌. ప్రముఖ ఆథ్యాత్మిక వేత్త స్వామి స్వరూపానంద్‌ ఇక్కడే జన్మించారు.

రత్నగిరి...
పశ్చిమ కోస్తా తీరంలో అందమైన ప్రాంతంతో పాటుగా జిల్లా కేంద్రం రత్న గిరి. ప్రముఖ స్వాత్రంత్య సమరయోధుడు బాల గంగాధర్‌ తిలక్‌ జన్మస్థలం ఇదే. ఆయన సేవలను గుర్తుపెట్టుకునే విధంగా తిలక్‌ స్మారక్‌ను ఇక్కడ ఏర్పా టుచేశారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిలక్‌ స్వదేశీ ఉద్యమాన్ని నడిపించారు. సమీపంలో రత్నదుర్గ్‌ కోట కూడా ఉంది.

వసతి...
గణపతిపూలేలో మహారాష్ట్ర పర్యాటక సంస్థకు చెందిన హో టల్‌తో పాటుగా ఇత ర వసతి సదుపాయా లు ఉన్నాయి.
ఎలా చేరుకోవాలి?

విమానమార్గం:
 బెల్గాంలో (299 కిలో మీటర్లు) విమానాశ్ర యం ఉంది.
రైలు మార్గం: 

రత్నగిరి (45 కిమీ), భోక్‌ (35 కిమీ) సమీపంలోని రైల్వే స్టేషన్లు.
రహదారి మార్గం: 

ముంబయి 375 కి.మీ., పూణె (331 కి.మీ.), కొల్హాపూర్‌ (144 కి.మీ.) దూరంలో గణపతిపూలే ఉంది. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top