ఊబకాయంతో సమస్యలెన్నో.....హోమియో చికిత్స

ప్రపంచవ్యాప్తంగా చాలామందిని పీడిస్తున్న సమస్య ఊబకాయం. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఊబకాయం వలన హృద్రోగం, టైప్ 2 మధుమేహం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారం తీసుకోవడం, ఆ మేరకు శారీరకశ్రమ చేయకపోవడంతో బరువు పెరుగుతుంది.

కారణాలు

వారసత్వ కారణాల వల్ల కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమలేని జీవితం గడపటం, కొన్నిసార్లు కొన్ని రకాలైన మందుల వాడకం వల్ల. హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఉంది.

ఊబకాయం వల్ల వచ్చే దుష్ఫలితాలు:

జీవితకాలాన్ని తగ్గిస్తుంది. అంటే చిన్నవయసులో వస్తే తక్కువ కాలం జీవిస్తారు. 
గుండెసమస్యలు, రక్తపోటు
ఊబకాయం ఉన్నవారిలో సాధారణమైన వారిలో కంటే ఆరింతలు అధికంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. హృద్రోగం, రక్తపోటు సమస్యలు, మూత్రపిండాలవ్యాధులు కనిపిస్తాయి. శ్వాసకోశ సంబంధ వ్యాధులు, మధుమేహం, నడుంనొప్పి, కీళ్లలో రక్తప్రసరణ సరిగా లేకపోవటం, రక్తం గడ్డ కట్టటం, నిద్రలేమి లేదా అధిక నిద్ర, పిత్తాశయపువ్యాధులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు.

ఎలా కనుక్కోవచ్చు?
పనిచేసేటప్పుడు త్వరగా అలసి పోవటం, చురుకుగా పనిచేయలేకపోవటం, ఎక్కువ బరువును మోస్తున్నట్లుగా అనిపించటం, రోజూ వేసుకునే దుస్తులు బిగుతుగా అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తే ఊబకాయం ఉందని అర్థం.

ఎలా త గ్గించుకోవచ్చు?
ఎక్సర్‌పైజుల ద్వారా, ఆహారంలో తగిన మార్పులు చేయడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. అంటే ఆహారంలో కొవ్వుపదార్థాలు, నూనె పదార్థాలు, చక్కెర, ఉప్పు, కూల్‌డ్రింక్స్, జంక్‌ఫుడ్స్ తగ్గించి, తాజాపండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండటం ఎప్పటికైనా ఆరోగ్యకరమే.

హోమియో చికిత్స
ఆంటిమోనియం క్రూడ్, కాల్కేరియా కార్బ్, ఫైటోలక్కాబెర్రి, కాప్సికం, ఫెరమ్
ర,
కాలికార్బ్, గ్రాఫైటిస్.
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top