మిక్స్‌డ్ వెజ్ పికిల్

కావలసినవి:
క్యారట్ - 200 గ్రా
బీన్స్ - 150 గ్రా

పచ్చిమిర్చి - మూడు
నూనె - 200 గ్రా

మిరప్పొడి - 150 గ్రా
పసుపు - చిటికెడు

ఆవపిండి - టీ స్పూన్
ఆవ నూనె- టీ స్పూన్
ధనియాల పొడి -టీ స్పూన్
నిమ్మ ఉప్పు - టీ స్పూన్
ఎండుమిర్చి - ఐదు

వెల్లుల్లి - ఐదు రేకలు
కరివేపాకు - ఒక రెమ్మ

ఉప్పు - తగినంత
జీలకర్ర - చిటికెడు

ఆవాలు- చిటికెడు
జీలకర్ర పొడి - అర టీ స్పూన్
మెంతిపొడి - అర టీ స్పూన్

తయారి:
క్యారట్, బీన్స్, పచ్చిమిర్చిలను కడిగి చిన్న ముక్కలుగా తరగాలి. బాణలిలో 50గ్రాముల నూనె పోసి అందులో ఈ ముక్కలన్నింటినీ వేసి ఒక మోస్తరుగా వేయించాలి(పచ్చిదనం పోవాలి, కరకరలాడకూడదు). వేయించిన ముక్కలను పెద్ద గిన్నెలో వేసి అందులో మిరప్పొడి, పసుపు, ఆవపిండి, ఆవనూనె, ధనియాల పొడి, ఉప్పు, నిమ్మ ఉప్పు, జీలకర్ర పొడి, మెంతిపిండి వేసి బాగా కలపాలి.

పోపు:
బాణలిలో 150 గ్రాముల నూనె వేసి అందులో వెల్లుల్లి రేకలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత దించాలి. నూనె చల్లారిన తర్వాత కూరగాయల ముక్కల్లో వేసి కలిపితే మిక్స్‌డ్ వెజిటబుల్ పికిల్ రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top