సిక్స్‌ప్యాక్ బాడీ కోసం సల్మాన్‌ఖాన్ పాట్లు......


బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ తన సిక్స్‌ప్యాక్ బాడీని పదిలంగా కాపాడుకునేందుకు తన అలవాట్లను మానుకుంటున్నాడు. ఇది వింతే అనిపించినా పచ్చినిజం. అందులో భాగంగానే ఈ మధ్య మద్యానికి కూడా దూరంగా వుంటున్నాడు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ బావ అతుల్ అగ్నిహోత్రి చిత్రం ‘మై లవ్ స్టోరీ’లో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం జోలికి వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చాడు. తన సిక్స్‌ప్యాక్ బాడీకోసమే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మలయాళం సినిమా ‘బాడీగార్డ్’ రీమేక్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోపాత సిక్స్‌ప్యాక్ బాడీతో ఉండాలి. ఈ మేరకు సల్మాన్ గత కొన్నిరోజులుగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం జిమ్‌లో కఠినమైన ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నాడు. గతంలో సల్మాన్ బకార్డి మద్యాన్ని కోకాకోలా కాంబినేషన్‌తో తీసుకునేవాడు. ముంబయిలోని గ్యాలక్సీ అపార్టుమెంట్‌లో తన స్నేహితులతో కలిసి ఆయన పార్టీలు చేసుకునేవారు. కానీ ‘మై లవ్ స్టోరీ’ చిత్రం షూటింగ్ మూలంగా సల్మాన్ ఈ మధ్యన పార్టీలకు దూరంగా ఉంటున్నారు. మద్యం ముట్టుకోవద్దని నిర్ణయం తీసుకోవడం వల్ల ఆయన పార్టీలవైపు కనె్నత్తి చూడడం లేదు. ‘దబంగ్’ చిత్రం షూటింగ్ సమయంలో సల్మాన్ బాగా బరువుపెరిగారు. ఈ చిత్రంలో ఆయన 45 సంవత్సరాల వయసున్న ఓ అవినీతి పోలీసు అధికారిగా నటించారు. ఇప్పుడు ఆ బరువు తగ్గించుకుని సిక్స్‌ప్యాక్ బాడీ కోసం సల్మాన్ జిమ్‌లో  చాలా కసరత్తులు చేయాల్సి వచ్చింది. ‘సల్మాన్ మద్యం తాగేందుకు ఇష్టపడతారు. కానీ దబంగ్ సినిమా, బిగ్‌బాస్ 4 రియాల్టీ షో సక్సెస్ సాధించడంతో గత కొంతకాలంగా ఆయన ఉత్సాహంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ‘మై లవ్ స్టోరీ’ కోసం సల్మాన్ మద్యాన్ని ముట్టుకోవడంలేదు అని సల్మాన్ స్నేహితులు చెబుతున్నారు. మద్యానికి దూరంగా వుండడం సల్మాన్‌కి ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈవిధంగా కొంతకాలం మద్యాన్ని ముట్టుకోలేదు వారంటున్నారు. ఇక ప్రతి సంవత్సరం సల్మాన్ రంజాన్ మాసంలో, వినాయక చవితి పండుగరోజుల్లో సైతం ఆయన మద్యం ముట్టుకోరు. ఆయన ఈ మధ్య కాలంలో తాను తీసుకున్న ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. ఇదంతా సిక్స్‌ప్యాక్ కోసమే అంటున్నారు బాలీవుడ్ జనాలు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top